Tuesday, October 30, 2012

అదృష్ట సంఖ్య 9 అయితే

స్వభావం : ధైర్యంగా వుంటారు. 
ఏ పని నైన ముందడుగు వేసి చేస్తారు.
జయాప జయాలు అసలు పట్టించుకోరు.
ఏ విషయమయిన ముఖం మీద చెప్తారు.
ఎవరి దగ్గర పని చేయరు.
ఆత్మాభి మానమునకు ఏదైనా బంఘం కలిగితే అసలు ఊరుకోరు.
ప్రేమ వ్యవహారం అయితే భంగం వాటిల్లుతుంది.
కీర్తి, ప్రతిష్టలకు భంగం కలుగుతుంది.
దాంపత్య జీవితం గొడవలు కలిగి వుంటారు. కాని కొంత సమయం మాత్రమే తరువాత అంతా చక్కబడుతాయి.
వైద్యం, పోలీస్ శాఖ, రైల్వే , విద్యుత్ , జ్యోతిష్య రంఘం లో మంచిగా రాణిస్తారు.

అనుకూలమయిన  దిక్కు : దక్షిణం.
అనుకూలమయిన వారములు : మంగళ, గురు, శుక్రవారము.
 అనుకూలమయిన రంగు : ఎరుపు.
అనుకూలమయిన అంకెలు : 9,18,27.
ప్రతికూలమయిన అంకెలు : 6,15,24.

పటించ వలసిన మంత్రము :  (ఏ ఒక్క మంత్రమయిన 11 సార్లు జపించాలి). 1. ఓం క్రాం క్రీం క్రౌం సః భౌమాయ నమః 

2. ఓం హ్రుం  శ్రీం మంగళాయ నమః 
3. ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో మంత్రః ప్రచోదయాత్.
 
    
  
  

అదృష్ట సంఖ్య 8 అయితే

స్వభావం : ఉద్రేకంగా మాట్లాడుతారు.
సంఘంలో ప్రజలు అపార్దం చేసుకుంటారు.
ఒంటరి జీవితం గడపాల్సి వస్తుంది.
మానసికంగా ఎదో ఆలోచిస్తూ వుంటారు.
మాటలు భాణాలు గా వుంటాయి. సంఘం లో వ్యక్తులు చేడుగా అనుకుంటారు. కానీ మనసు మంచిగా వుంటుంది.
ఏ పని అయినా చేయగలిగిన సత్తా వుంటుంది.
ప్రేమ వ్యవహారం లో విజయం వుండదు.
30 సంవచ్చరముల తరువాత జీవితం గురించి ఆలోచిస్తారు.
దాంపత్యం బాగుంటుంది.
కృషి చేసే రంగం లో పరిశోధన చేసి  క్రొత్త  విషయాన్ని కనిపెడతారు.
ప్రభుత్వ ఉద్యోగం అనుకూలం.కానీ పని చేసే చోట కొద్దిగా ఇబ్బందులు వుంటాయి.
ఆరోగ్యం జీర్ణాశయం, పళ్లకు, ఉదర సంబంధ వ్యాధులు రావటానికి అవకాశం వుంటుంది. 
 శని గ్రహ ప్రభావ జనితులై  వుంటారు.
ఏ సంవచ్చరంలో నైన డిసెంబర్ 21 నుండి జనవరి 20 వరకు అనుకూలం.
మరియు జనవరి 20 నుండి ఫిబ్రవరి 26 వరకు చాలా అనుకూలంగా వుంటుంది.
అనుకూలమయిన వారములు : శని, ఆది , సోమ 
అనుకూల మయిన దిక్కులు : ఆగ్నేయం, దక్షిణం.
అనుకూలమయిన రంగులు : నేరేడు, నలుపు, బూడిద, ముదురు నీలం .
ప్రతికూలమయిన రంగులు : లేత వర్ణాలు.
పటించ వలసిన మంత్రము :  (ఏ ఒక్క మంత్రమయిన 11 సార్లు జపించాలి). 
1. ఓం ఖ్రాం ఖ్రీం ఖ్రౌం సః శనేయ నమః 
2. ఓం ణం హ్రీం శ్రీం శనై శ్చరాయ  నమః 
3. ఓం కాకద్వజాయ విద్మహే కడ్గ హస్తాయ ధీమహీ తన్నో మంత్రః ప్రచోదయాత్ .

అదృష్ట సంఖ్య 6 అయితే

స్వభావం : తేలిక స్వభావం, ఆనందంగా గడిపే స్వభావం కలిగి వుంటారు. అలాంటి వారితో మాత్రమే స్నేహం చేస్తారు.

శుక్ర గ్రహ ప్రభావ జనితులై  వుంటారు.
ధనం ఎప్పుడు వుంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి వుంటుంది.
 సంఘ జీవితం ఆనందంగా వుంటుంది.
బంగారు ఆభరణాలు బాగా ధరిస్తారు.
సౌందర్య ఉపాసకులు, ఇంటిని బాగా అలంకరించుకుంటారు.
స్త్రీ సంబంధ విలాస వస్తువులు, మధుర పదార్దాలు అమ్మే దుకాణాలు, బట్టల వ్యాపారం పెట్టినచో చాల అనుకూలంగా వుంటుంది.
సంగీతం , కళలలో ఎక్కువ ఆసక్తి కలిగి వుంటారు.
 బంధం అయిన చివరి వరకు వుండాలనుకుంటారు.
ఏ సంవచ్చరంలో నైన ఏప్రిల్ 20 నుండి మే 20 వరకు మరియు సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 22 వరకు చాలా అనుకూలంగా వుంటుంది.
సంఘంలో ఎలాంటి వ్యక్తితో నైన చాల సులభంగా స్నేహం గా వుంటారు.
నమ్మిన స్నేహం కోసం ప్రాణం పెడతారు.
స్నేహం కోసం ఏమయిన చేస్తారు.
 సినిమా, టీవి రంగంలో రాణిస్తారు.
వంశ పారంపర్యం గా గాని, సంపాదించిన దైన ఎప్పుడు ధనం వుంటుంది.
ఏది జరిగిన వెంటనే చెప్పుకోవాలనుకుంటారు.

కలిసి వచ్చే అంకెలు: 6,9,15,18,24,27.
అనుకూలమయిన వారములు :మంగళ వారము, గురువారము, శుక్రవారము.
ధరించ వలసిన  రత్నము : వజ్రము.



పటించ వలసిన మంత్రము :  (ఏ ఒక్క మంత్రమయిన 11 సార్లు జపించాలి).
1. ఓం ద్రాం ద్రీం ద్రౌం సః శుక్రాయ నమః 
2. ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః 

అదృష్ట సంఖ్య 5 అయితే

స్వభావం : తేలిక స్వభావం, ఆనందంగా గడిపే స్వభావం కలిగి వుంటారు. అలాంటి వారితో మాత్రమే స్నేహం చేస్తారు.

బుద గ్రహ ప్రభావ జనితులై  వుంటారు.
ఇతరులు చెప్పిన మాటలను సలహాలను అస్సలు వినరు.
ఉద్రేకం, చాలా విచిత్రం గా ప్రవర్తిస్తూ వుంటారు.
బంధువులతో గడపటానికి అంతగా ఇష్ట పడరు.
ఎలాంటి సమస్య నైన చాల సులభంగా అధిగమిస్తారు.
భాగస్వామితో అంత బాగా  వుండరు. కానీ గొడవలు ఏమి రాకుండా చూసుకుంటారు.
విద్యలో బాగా రాణిస్తారు.
ధనాన్ని కూడబెట్టాలి అన్న స్వభావం తక్కువ.  
షేర్స్ లో బాగా కలిసి  వస్తుంది.
ఏదైన  పని జరగాలి అంటే ఎవరిని నొప్పించక పని సులభం గా జరిపించు కుంటారు.
ఆరోగ్యానికి సంబంధించి నరాల వ్యాధులు వస్తాయి.

కలిసి వచ్చే అంకెలు: 5, 14, 23.
అనుకూలమయిన రంగులు బూడిద రంగు, తెలుపు.
అనుకూలమయిన వారములు : బుధ వారము, శుక్రవారము.
మే 21 నుండి జూన్ 20 వరకు ఏ సంవచ్చరమ్ లో నైన ఏ పని చేసిన కలిసి వస్తుంది.

పటించ వలసిన మంత్రము :  (ఏ ఒక్క మంత్రమయిన 11 సార్లు జపించాలి).
1. ఓం భ్రాం భ్రీం భ్రౌం సః భుదాయ నమః 
2. ఓం ఐం స్త్రీం బుధాయ నమః 
 

అదృష్ట సంఖ్య 4 అయితే

స్వభావం : అనుకూల స్వభావం, సేవిక సంబంద స్వభావం కలిగి వుంటారు.
వీరి వలన ఇతరులు చాలా లాభ పడతారు.
 కానీ ఇతరుల వలన వీరికి అంత బాగా వుండదు.
జాయింట్ వ్యాపారము కలిసిరాదు.
వివాహం త్వరగా జరుగుతుంది.
ధనం బాగా ఖర్చు చేస్తారు.
ముందు , వెనుక ఆలోచించరు.
అవసరానికి తగినట్టుగ ధనం ఎదో ఒక రూపంలో వస్తుంది.
రాహు గ్రహ ప్రభావ జనితులై  వుంటారు.
వీళ్ళ మనస్సు వీరికి శత్రువు.
తమకు సంభవించే అన్ని విషయాల వ్యక్తులు చెడు చేయాలనే ఉద్దేశ్యం కలిగి వుందని అనుకుంటారు.
కలిసి వచ్చే అంకెలు: 4,13,22,31.

అనుకూలమయిన రంగులు : బూడిద రంగు, లేత నీలం.
దరించ వలసిన రాళ్ళు : ఇంద్ర నీలం.

పటించ వలసిన మంత్రము :  (ఏ ఒక్క మంత్రమయిన 11 సార్లు జపించాలి).
1. ఓం భ్రాం భ్రీం భ్రౌం రాహువే నమః 
 2. ఓం ఐం హ్రీం రాహువే నమః 
 3. ఓం నాగద్వజాయ  విద్మహే పద్మ హస్తాయ దీమహీ తన్నో రాహుహు ప్రచోదయాత్.  

అదృష్ట సంఖ్య 3 అయితే

స్వభావం :    సత్ ప్రవర్తన , నీతి నియమాలు, ప్రజ్ఞా వంతులు , బుద్ది మనస్సు చాలా బాగుంటుంది.
 ఆద్యాత్మికత కలిగి వుంటారు.
గణిత శాస్త్రంలో రానిమ్చాతానికి అవకాశం వుంటుంది. 
వారు అనుకున్నదే చేస్తారు.
గురు గ్రహ ప్రభావ జనితులై  వుంటారు.
కలిసి వచ్చే దిక్కు : ఈశాన్యం .
కలిసివచ్చే వారములు :  మంగళ వారం, గురువారం, శుక్ర వారము.
కలిసి వచ్చే అంకెలు: 3,12,21,30.
ఆడవారికి 6,8,9 అదృష్ట సంఖ్యలు  కలిగిన వారితో  వివాహం చేసిన చాలా బాగుంటుంది.
అనుకూలమయిన రంగులు : ఊదా , కెంపు, నీలం, నేరేడు, గులాబీ .


పటించ వలసిన మంత్రము :  (ఏ ఒక్క మంత్రమయిన 11 సార్లు జపించాలి).
1. ఓం గ్రాం గ్రీం గ్రౌం సః గురవే నమః  2. ఓం ఐం క్లీం బృహస్పతయే నమః 
   

అదృష్ట సంఖ్య 2 అయితే

స్వభావం : సున్నిత స్వభావం కలిగి ఉంటారు 
చంద్రగ్రహ ప్రభావ జనితులై  వుంటారు .
వీరు 15 రోజులు ఆనందం 
15 రోజులు విచారంగా వుంటారు
ప్రకృతి సౌందర్య కారకులయి వుంటారు .
సంఘ జీవితం అంత ఆసక్తిగా ఉండదు.
ఉన్నత విద్యలో రాణిస్తారు .
సంగీతంలో రాణిస్తారు .
కవులు , కళాకారులు  కాగలరు .
ప్రేమ వ్యవహారం లో విజయం వుంటుంది.
ఒకరు , ఇద్దరు ప్రాణస్నేహితులు మాత్రమే వుంటారు.
స్త్రీ మూల ధన ప్రాప్తి సిద్దిస్తుంది.
వివాహం తరువాత అయితే భార్య వలన ధనప్రాప్తి వుంటుంది.
మానసికం గ ఎదో ఆలోచలో ఉంటుంటారు.
ఉత్తర దిక్కు బాగా కలిసి వస్తుంది.

ధరించవలసిన రాళ్ళు :జాతిముత్యం, చంద్రకాంతమణి.
అనుకూలమయిన సంఖ్యలు :2,11,20,29.ప్రతికూలమయిన సంఖ్యలు  : 6,8,15,24,26.
 అనుకూలమయిన నెలలు :  జూన్, జూలై.
 అనుకూలమయిన రంగులు : తెలుపు, మీగడ వన్నె, ఆకుపచ్చ.
ప్రతికూల రంగులు : నలుపు , నేరేడు.
అదృష్ట సంఖ్య  5 లేదా 2 అంకె వచ్చిన వారికీ ఇచ్చి వివాహం చేయవలెను.


పటించ వలసిన మంత్రము :  (ఏ ఒక్క మంత్రమయిన 11 సార్లు జపించాలి).
ఓం శ్రాం శ్రీం శ్రౌం సః చంద్రాయనమః
ఓం ఐం క్లీం సోమాయనమః
ఓం భుర్భావ స్వః  యం యంత్ర్యంబకం యజామహే సుగందిం పుష్టి వర్ధనం వుర్వారుక మివ బంధనాన్న జ్యాః యక్షయ  యమామ్నత.
  




మీ అదృష్ట సంఖ్య 1 అయితే.....

స్వభావం :  లీడర్ షిప్ కలిగిన స్వభావం , సేవా భావం కలిగి వుంటారు
సూర్య గ్రహ ప్రభావ జనితులై  వుంటారు .
35 సంవత్సరముల తరువాత అభివృద్ది లోకి వస్తారు .
రోజు సూర్య నమస్కారం చేసినచో అనుకున్నవి అన్ని కార్యాలు మంచిగా జరుగుతాయి.
భార్య మీద అంతగా ఆసక్తి కనబరచరు.
ధరించవలసిన రాళ్ళు : కెంపు, పుష్య రాగం.
అనుకూలమయిన వారము : ఆదివారము, సోమ వారము.
అనుకూలమయిన సంఖ్యలు : 10,19,20.
ప్రతికూలమయిన సంఖ్యలు  : 8,17,26.
 అనుకూలమయిన నెలలు : ఏప్రిల్, జూన్, జూలై, ఆగస్ట్ .
 అనుకూలమయిన రంగులు : ఎర్ర గోధుమ , పసుపు పచ్చ,  బంగారు రంగు .
వీరికి  వివాహం చేసిన కూడా కొన్ని అంకెలు అదృష్ట సంఖ్యలు కొన్ని 2,3,5,8,9 వీరితో వివాహం చేయకూడదు,
 వీరికి  అదృష్ట సంఖ్య 4,6,7 కలిగిన అమ్మాయిలతో వివాహం చేసినచో చాలా ప్రసస్తంగా వుంటుంది.



పటించ వలసిన మంత్రము :  (ఏ ఒక్క మంత్రమయిన 11 సార్లు జపించాలి).
ఓం హ్రమ్ హ్రీం హ్రౌం సహా  సూర్యయ నమః
ఓం  హ్రీం సూర్యయ నమః
ఓం అశ్వర్ధ జాయ విద్మహే పద్మహస్తాయ దీమహీ తన్నః మంత్రః ప్రచోదయాత్ .




Thursday, October 25, 2012

సాయిబాబా ప్రబోధనలు


                               సాయిబాబా ప్రబోధనలు    
                                              
సాయిబాబా మనలో ఉన్న ఈర్ష్య, అసూయ, కామం, మోహం లాంటి దుర్గుణాలను పోగొట్టుకోమని పదేపదే చెప్పేవాడు. స్వార్థం తగ్గించుకుని ఆధ్యాత్మిక చింతన పెంచుకోమని హితబోధ చేశాడు. ప్రేమ భావాన్ని పెంచుకోమని ప్రబోధించాడు. తోటివారితో ప్రేమగా మసలుకోమని, జంతుజాలాన్ని కూడా ఆదరించమని చెప్పేవాడు.

సాయిబాబా తన వద్దకు వచ్చే భక్తులనే కాదు, చీమ, దోమ, కుక్క, పులి అన్ని జీవరాశులనూ సమానంగా భావించేవాడు. బాబా బిక్షాటన చేసి వచ్చిన తర్వాత ఘన పదార్ధాలను ఒక పాత్రలో, ద్రవ పదార్థాలను ఇంకో పాత్రలో ఉంచేవాడు. మనుషులు మొదలు ఇతర జీవరాశుల వరకూ తమకు కావలసినది తినేందుకు వీలుగా ఉంచేవాడు. కుక్కల్లాంటివి మూతి పెట్టినా అస్సలు చీదరించుకునేవాడు కాదు. అందరూ తిన్న తర్వాత చివరికి మిగిలింది సాయిబాబా తినేవాడు.

జీవరాశులు అన్నీ సమానమే అని చెప్పడానికి, ప్రతిదానిలో తాను ఉన్నానని చాటి చెప్పడానికి భక్తులకు ఎన్నో నిదర్శనాలు చూపించేవాడు. సాయిబాబా ప్రతి మాట, ప్రతి చేష్ట మనిషిని, మహా మనిషిగా తీర్చి దిద్దేందుకు ఉపయోగపడేది. ఆయన బోధనలు ఎంత ప్రబోధాత్మకంగా ఉంటాయో, ఎంత స్పష్టంగా ఉంటాయో ఒకసారి చూడండి...

''ఏదో అవినాభావ సంబంధం ఉంటేనే ఒకర్ని ఒకరు కలుసుకుంటారు. ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం లేకుంటే ఒకరి దగ్గరకు ఇంకొకరు రారు. కనుక అలా వచ్చిన వ్యక్తులు లేదా జంతువులు కానీ మీ వద్దకు వస్తే నిర్దాక్షిణ్యంగా వాటిని తరిమివేయొద్దు. మన వద్దకు వచ్చినవారిని ప్రేమతో ఆదరించాలి. జంతువులు అయినా అంతే. సాదరంగా దగ్గరకు తీయాలి. కనికరం చూపించాలి. ఆప్యాయంగా ఆకలి తీర్చాలి.

తోటి వ్యక్తులను, జంతుజాలాన్ని ఆదరించడం వల్ల మన సంపదలు ఏమీ కరిగిపోవు. దాహార్తితో వచ్చినవారికి తాగడానికి నీళ్ళు ఇచ్చి దాహం తీర్చు. ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా భోజనం పెట్టు. కట్టుకోడానికి బట్టలు లేక అవస్త పడుతున్నవారికి దుస్తులు ఇచ్చి ఆదుకో. అవసరమైన వారికి కాసేపు ఇంట్లోకి ఆహ్వానించి, విశ్రాంతి పొందమని చెప్పు. ఇలా నువ్వు మానవ సేవ చేస్తే మాధవ సేవ చేసినట్లే. నువ్వు ఇలా సహ్రుదయ౦తో ఉంటే, భగవంతుడు సంతోషిస్తాడు. నువ్వు దేవుడికి దగ్గరైనట్లే. ఇతరులకు మేలు చేసేవారికి భగవంతుని అనుగ్రహం ఉంటుంది. తన కరుణాకటాక్షాలను ప్రసరింపచేస్తాడు.

బంధుమిత్రులు లేదా పరిచయస్తులు డబ్బు అవసరం ఉండి, లేదా మరేదో సహాయం కోరి నీ వద్దకు వచ్చినప్పుడు వీలైతే సాయం చేయి. ఒకవేళ వారికి చేయి అందించడం నీకు ఇష్టం లేకుంటే, లేదా సాయం చేయలేకపోతే చేయకు. కానీ, వారిని విసుక్కోకు. ఈసడించుకోవడం, సహించలేనివిధంగా దుర్భాషలాడటం చేయకు. అవతలి వ్యక్తే నీతో దురుసుగా, పరుషంగా, నొప్పించేవిధంగా మాట్లాడినా, అనవసర నిందలు వేసినా, లేనిపోని ఆరోపణలు చేసినా ఉదారంగా ప్రవర్తించు. కఠినంగా జవాబులు చెప్పకు.

అవతలి వ్యక్తి నిందలు మోపినప్పుడు భరించడం వల్ల నీకు వచ్చే నష్టం ఏమీ లేదు. తిరిగి నిష్ఠూరంగా మాట్లాడ్డం వల్ల నీకు ఒనగూరే లాభమూ లేదు. అవతలి వ్యక్తి అజ్ఞానాన్ని భరించి, ఔదార్యం చూపడంవల్ల నీకు అవ్యక్తమైన ఆనందం కలుగుతుంది. నెమ్మదిగా ఉండు. జరుగుతున్నదంతా నాటకం అని భావించి, ఉదారంగా ఉండటం అలవాటు చేసుకో.

అహంకారాన్ని పోగుట్టుకోవాలి. ఎప్పుడైతే అహంకారం తొలగిపోతుందో, నీకు, నాకు మధ్య అడ్డుగోడ తొలగిపోతుంది. అప్పుడు మన ఇద్దరిమీ ఒకటే అవుతాం. నీకు, నాకు బేధం ఉండి అనుకోకు. ఆ భావమే నిన్ను నాకు దూరం చేస్తోంది. ఈ బేధ భావం నీలో నెలకొని ఉంటే, నువ్వు, నేను ఒకటి కాలేము...''

సాయిబాబా బోధనలు చదివి వదిలేయకుండా ఆచరించే ప్రయత్నం చేద్దాం.

Tuesday, October 23, 2012

దేవీనవరాత్రుల విశిష్టత.............

                                                 

ఆశ్వీయుజమాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము. ఆ ఆనందానికి గలకారణం "అమ్మ" గుర్తుకు రావటమే! అమ్మ అంటే మరి ఎవరోకాదు ఆ జగన్మాత, ముగ్గురమ్మల మూలపుటలమ్మ, నవదుర్గాస్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీ దేవి. ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో వున్న చరాచర వస్తువులన్నిటిలోనూ మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది.

ఈ సృష్టిలోగల జ్యోతిర్మండలాలు మానవనిర్మితాలు మాత్రము కావు అన్నది రూఢీగా అందరూ ఆమోదించే విషయం. ఆ శక్తినే మహేశ్వరీ శక్తిగానూ, పరాశక్తిగానూ, జగన్మాత శక్తిగాను పలురూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల పుణ్య దినాలలో ఏనోట విన్నా ఈ దుర్గాసప్తశతి శ్లోకం వింటూ ఉంటాము.

శ్లో!! సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే,
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.

ఈ శక్తే కనుక లేకుంటే శివుడైనా ఏమి చెయ్యలేడని శివునియొక్క శక్తి రూపమే "దుర్గ" అని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృతవాక్కులో చెప్పారు. ఈ దేవదేవి రాత్రిరూపం గలది అని పరమేశ్వరుడు పగలు రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వపాపాలు నాశనమవుతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది. ఆశ్వీయుజమాసంలోని  శుక్లపక్షంలో పాడ్యమి తిథిలో, హస్తా నక్షత్రముతో కూడియున్న శుభదినాన ఈదేవీపూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తోంది. అందువల్ల ఆ రోజునుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు. మొదటి మూడురోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి.

దేవతలు భండాసురుడనే రాక్షసుని బారినుండి రక్షణ పొందడానికి ఆ ఆదిపరాశక్తి తప్ప వేరేమార్గములేదని తలచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞగుండంలో వారి వారి శరీర భాగాలను ఖండించుకుని ఆహుతి చెయ్యగా ఆ జగన్మాత కోటి సూర్య కాంతులతో ప్రత్యక్షమయ్యింది. వారికి అభయమిచ్చి భండాసురుని సంహరించి వారి అభీష్టము నెరవేర్చింది.

ఆ దేవి పాడ్యమి నుండి నవమి వరకు ఒక్కోరోజు ఒక్కొక్క రాక్షసుని వధించసాగింది. ఆ ఆది శక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా
1. శైలపుత్రి
2. బ్రహ్మచారిణి
3. చంద్రఘంట
4. కుష్మాండ
5. స్కందమాత
6. కాత్యాయనీ
7. కాళరాత్రి
8. మహాగౌరి
9. సిద్ధిధాత్రి
అను రూపాలతో ఆ దేవి పూజలు అందుకోసాగింది. మొదట ఈ దేవదేవీ "శ్రీకృష్ణ పరమాత్మ" చే గోకులం, బృందావనంలో పూజలందుకుంది. బ్రహ్మదేవుడు మధు కైటభులనే రాక్షసుల నుండి రక్షణకై ఈమెను స్తుతించి విముక్తి పొందాడు. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయము నందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు. దేవేంద్రుడు దుర్వాసుని శాపంవల్ల సంపదలన్నీ సముద్రములో కలసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదల్ని పొందగలిగిగాడు. ఇలా మహామునులు, దేవతలు, సిద్ధులు, మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఆ మహాశక్తిని ఎంతగానో ఆరాధించి ఆమె కటాక్షం పొందుతున్నారు. ఈ నవరాత్రి ఉత్సవములలో దేవి నవాంశల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. రెండు సంవత్సరాల బాలిక నుండి పది సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోఢశోపచారాలతో పూజిస్తారు. ఈ కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య పాముద్ర పూజను చేసిందట! ఈ దేవి యొక్క అష్టాదశ (18) శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి. ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక దేవీ ఉపాసకులైతే ఈ నవరాత్రులు అంటే, ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు.

ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకంతో

శ్లో ! శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ !
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ !!

అను శ్లోకమును స్మరిస్తూ ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి. ఇలా మానవులను మానవులుగా తీర్చిదిద్ది, మ అనగా మాయ, న అంటే లేకుండా, వ అంటే వర్తింప చేసే తల్లిగా లాలించి, తండ్రిగా పోషించి, గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం.

అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా మనకు ఏర్పడిన సర్వ దుఃఖాల నుండి ఉపశమనం పొందాలన్నా దారిద్రం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై ఈదేవి నవరాత్రుల యందు ఆదేవదేవికి పూజలతోపాటు ఖడ్గమాల స్తోత్రం, శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యమూ గావించి ఆ జగన్మాత కృపాకటాక్ష వీక్షణలు మనమంతా పొందుదాము.

Wednesday, October 3, 2012

చిలుకూరు బాలాజీ టెంపుల్

                                                            


చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి విననివాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. హైదరాబాదు పరిసర ప్రాంతాల ప్రజలే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండీ చిలుకూరు బాలాజీ భక్తులు టెంపుల్ కు వస్తున్నారు. అంతకుముందు చిలుకూరు బాలాజీ టెంపుల్ అనామకంగా ఉన్నప్పటికీ ఈమధ్యకాలంలో బాగా ప్రసిద్ధి చెందింది.

ఒక పదిహేను ఏళ్లుగా ఎక్కడెక్కడి నుంచో చిలుకూరు బాలాజీ భక్తులు పోటెత్తి వస్తున్నారు. హైదరాబాదు నగర శివార్లలో ఉన్నఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేక సందర్భాల్లో కిక్కిరిసిన జనంతో తిరుమలను తలపిస్తుంది.

చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళిన భక్తులు 11 ప్రదక్షిణాలు చేసి, మొక్కుకుంటారు - తమ కోరిక నెరవేరగానే మరోసారి గుడికి వెళ్ళి 101 సార్లు ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ. అలా చేస్తే చిలుకూరు బాలాజీ భక్తుల కష్టాలు తీరతాయని, ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మొక్కుకున్న విద్యార్థులకు వీసా వస్తుందని విశ్వసిస్తున్నారు. ఆ నమ్మకం ఎంతగా బలపడిందంటే చిలుకూరు బాలాజీకి వీసా వెంకటేశ్వరుడనే పేరు స్థిరపడింది.

ఇటీవలికాలంలో ఇంతగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ టెంపుల్ నిజానికి ఇప్పటిది కాదు. ఉస్మాన్ సాగర్ తీరంలో ఉన్న ఈ చిలుకూరు చాలా పురాతనమైంది. చిలుకూరు పది, పన్నెండు శతాబ్దాల్లో రాష్ట్రకూటులు, కళ్యాణీ పశ్చిమ చాళుక్యుల ప్రత్యక్ష పాలనలో ఉండేదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రాజులు, సామంతులు, దండనాయకులు అప్పట్లో చిలుకూరును రాజధానిగా చేసుకుని పాలించినట్లు శాసనాలు లిఖించి ఉన్నాయి. అబుల్ హసన్ తానీషా మంత్రులు అక్కన్న, మాదన్నలు చిలుకూరు బాలాజీ టెంపుల్ ను దర్శించుకున్నారు. అంటే భద్రాచలం రామాలయం కంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ పురాతనమైంది.

శ్రీనివాసుని కంఠమున తులసిమాలగా వకుళమాత

                                                         
వనవిహారమునకు వెళ్ళిన శ్రీనివాసుడు, పద్మావతి ఎంతసేపటికి కుటీరమునకు రానందుకు తన పెద్దకుమారుడైన గోవిందరాజస్వామిని వకుళమాత తోడుగావెంటబెట్టుకొని ఆనందనిలయమును సమీపించి శిలగా మారిన శ్రీనివాసుని చూచి "నాయనా! శ్రీనివాసా!" అని ఆర్తనాదము చేసెను. శిలలో నుండి మాటలు ఈ విధముగా వకుళమాతకు వినిపించాయి. "జననీ! నీకు ముక్తి ప్రసాదించుచున్నాను. నీవు తులసిమాలగా మారి నా కంఠమున చేరు" అన్నట్లు వినిపించెను. వకుళామాత తులసిమాలగా శ్రీనివాసుని కంఠమున చేరెను. అందుకే శ్రీనివాసస్వామివారిని తులసిదళములతో పూజిస్తారు. శ్రీనివాసస్వామికి తులసిదళములు అంటే చాలా ప్రీతి.

గోవిందరాజస్వామి తిరుపతి పట్టణమున వేలయుట :-
గోవిందరాజస్వామి, శిలగాయున్న తమ్మున్ని చూసి శ్రీనివాసా! ధనరాసులు ఎంత కొలచినను తరుగుట లేదు. ఆయాసమగుచున్నది అనగా, "సోదరా! నీహస మందు ధనరేఖలు యున్నవి. కావున సిరి ఎక్కువ అగుచుండును. నీవు కొండక్రింది భాగమున పోయి విశ్రాంతి తీసుకొనుము" అన్నాడు.

వెంటనే గోవిందరాజస్వామి కొండ క్రిందికి పోయి కొలత పాత్రను తల క్రింద ఉంచుకొని శిలగా మారిపోయాడు. గోవిందరాజస్వామి వెలసిన ప్రదేశము కాబట్టి దానికి గోవిందరాజ పట్టణము అని పేరు వచ్చినది. కాలక్రమేణ అది తిరుపతి పట్టణముగా పేరు వచ్చింది.

పర్వత నామములు :-
శ్రీ తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామీ నివసించు పర్వతమునకు ఏడు పేర్లు కలవు.
ఆదిశేషుని రూపమున ఉండుటచే - శేషాచలము అని
ఆ పర్వతమున వేదములు ఇమిడివున్నందున - వేదాచలము అని
భూలోకమునకు గరుత్మంతునిచే పర్వతమును చేరినందుకు - గరుడాచలం అని
వృషాసురుడు  అను రాక్షసుడు మోక్షము పొందినందున - వృషభాద్రి అని
అంజనాదేవి తపస్సు చేసి హనుమంతుని కన్నస్థలము అయినందున  - అంజనాద్రి అని
ఆదిశేషుడు, వాయుదేవుడు బలాబలములు చూపి పర్వతము ఇచ్చట చేర్చినందుకు - ఆనందగిరి అని
మన పాపములు పోగొట్టు పర్వతము అయినందుకు - వెంకటాచలము అని సార్థకమయి ఈ పర్వతములకు పేర్లు కలిగాయి.

వేంకటేశ్వరునికి ఆలయం కట్టించిన తొండమానుడు

                                                            

జగత్ ప్రసిద్ధి పొందిన తిరుమల వేంకటేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారో , దాని వెనుక ఉన్న కధ ఏమిటో తెలుసుకుందాం. ప్రస్తుతం కాంచీపురంగా పిల్చుకునే ఒకప్పటి తొండైమండలం సామ్రాజ్యానికి అధిపతి తొండమానుడు. ఒకరోజు తొండమానుడు ఓ మధుర స్వప్నాన్ని కన్నాడు. ఆ కలలో విష్ణుమూర్తి కనిపించి ఇలా చెప్పాడు.

''భక్తా, పూర్వజన్మలో నీ పేరు రంగదాసు. నీకు స్త్రీ వ్యామోహం లేకుండా చేసి, నిన్ను మహారాజుగా చేశాను. క్రమంగా మనమధ్య బాంధవ్యం పెరిగింది. అనుబంధం పెనవేసుకుంది. ప్రస్తుతం నేను వేంకటేశ్వరునిగా శేషాచలమున స్థిర నివాసం ఏర్పరచుకో దలచాను. కలియుగం అంతమయ్యేవరకు వేంకటేశ్వరుని అవతారంలో, కొండమీదే ఉంటాను. కనుక నువ్వు నాకోసం ఒక ఆలయాన్ని నిర్మించాలి. శ్రీ వరాహస్వామి పుష్కరిణి పక్కన ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించాడు. అక్కడ నువ్వు వెంటనే ఆలయాన్ని కట్టించు..'' అన్నాడు.

వేంకటేశ్వరుని మాటలు విన్న తొండమానుడు - ''సంతోషం స్వామీ, గొప్ప మాట సెలవిచ్చారు.. తమరు కోరిన విధంగా తక్షణం ఆలయం నిర్మిస్తాను...'' అని బదులిచ్చాడు.

అంతటితో తొండమానుడికి మెలకువ వచ్చేసింది. ఇక ఆతనికి ఆకాశంలో తెలిపోతున్నట్టుగా ఉంది. స్వామివారు తనకు స్వప్నదర్శనం ఇవ్వడం అంటే సామాన్యమైన సంగతి కాదు. పైగా తనకో గుడి కట్టించమంటూ బృహత్తర బాధ్యత అప్పజెప్పాడు. అది కేవలం కలగా అనిపించలేదు. వేంకటేశ్వరుడు ప్రత్యక్షమైనట్టే ఉంది. స్వయంగా చెప్పిన భావనే కలిగింది. సంతోషంతో మురిసిపోయాడు. శ్రీనివాసుని కోసం ఆలయం నిర్మించేందుకు ఆప్తులతో చర్చించాడు, ప్రణాళిక రచించాడు.

తొండమానుడు వెంటనే విశ్వకర్మను రప్పించాడు. మంచి ముహూర్తం చూసి ఆలయ నిర్మాణం కోసం పునాదులు వేయించాడు. కేవలం దేవాలయం, గర్భగుడి, ధ్వజస్తంభంతో సరిపెట్టకుండా బ్రహ్మాండంగా కట్టించాలి అనుకున్నాడు. తొండమానుడు అనుకున్నట్టుగానే, అనతికాలంలోనే దేవాలయ నిర్మాణం పూర్తయింది. విశాలమైనపాకశాల, సువిశాలమైన గోశాల, గజశాల, అశ్వశాల, బంగారు బావి, మంటపాలు, ప్రాకారం, గోపురం - ఇలా అనేక గదులతో ఆలయం బహు గొప్పగా రూపొందింది.

ఆలయం అపురూపంగా ఉంటే సరిపోతుందా? గుడిని చేరడానికి మార్గం సుగమంగా ఉండాలి కదా. అందుకోసం కొందరు భక్తులు శేషాచలం చేరడానికి రెండువైపులా దారులు ఏర్పరిచారు. సోపానాలు నిర్మించారు. మార్గమధ్యంలో అక్కడక్కడా మంటపాదులు నిర్మించారు.

ఆలయ నిర్మాణం, గుడికి వెళ్ళే రహదారి, సోపానాలు పూర్తయిన తర్వాత విషయాన్ని వేంకటేశ్వరునికి తెలియజేశాడు తొండమానుడు. వేంకటేశ్వరుడు ఈ వర్తమానాన్ని సవివరంగా ముల్లోకములకు తెలియపరిచాడు. అప్పుడు బ్రహ్మ, మహేశ్వరుడు, ఇతర దేవతలు అందరూ కలిసి శేషాచలం చేరుకున్నారు. శుభ ముహూర్తం చూసి వేంకటేశ్వరుడు పద్మావతీ సమేతుడై ఆలయమున ఆనంద నిలయంలో ప్రవేశించాడు. అది అద్భుతమైన, అపురూపమైన వేడుక. అత్యంత కమనీయంగా, రమణీయంగా జరిగింది. ఆ వేడుకను చూట్టానికి రెండు కళ్ళూ చాల్లేదు.

వేంకటేశ్వరుడు ఆలయంలో ప్రవేశించే సమయంలో దేవతలు పూవులు జల్లారు. అతిధులకు పంచభక్ష్య పరమాన్నాలతో విందుభోజనం ఏర్పాటు చేశారు. దక్షిణ, తాంబూలాలు ఇచ్చారు. వస్త్రాలు, ఆభరణాలు సమర్పించారు. ఆవిధంగా దేవతలందరినీ సగౌరవంగా సత్కరించి పంపారు.

తిరుమల వేంకటేశ్వరుని ఆలయ వివరాలు పురాణాల్లో ఈవిధంగా ఉన్నాయి. మొత్తానికి తొండమానుడు కట్టించిన దేవాలయాన్ని చోళులు అభివృద్ధి చేశారు. తర్వాత పల్లవరాజులు, తంజావూరు చోళులు, విజయనగర రాజులు దేవాలయాన్ని మరింత తీర్చిదిద్దారు.