Thursday, September 27, 2012

సాయి చేష్టల వెనుక గూఢార్ధం

                     సాయి చేష్టల వెనుక గూఢార్ధం
                      
సాయిబాబా అవతార మూర్తి. ఆయన్ను ప్రత్యక్షంగా చూసి తరించినవారు ధన్యులు. బాబాతో సన్నిహితంగా మెలిగే అవకాశం పొందినవారు, ఆ పుణ్యమూర్తి సాంగత్యం పొందివారు అదృష్టవంతులు. మహల్సాపతి, తాత్యాకోతే పాటిల్ తదితరులు ఎందరో బాబాతో సన్నిహితంగా గడిపారు. వారిద్వారా సాయిబాబాకి సంబంధించిన విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది.

సాయిబాబా దర్శనానికి వచ్చిన భక్తులు తిరిగి వెళ్లేముందు బాబా అనుమతి తీసుకుని వెళ్ళేవారు. ఆయన సమ్మతిస్తేనే వెళ్ళాలి. బాబా గనుక ''ఇప్పుడు వద్దు'' అని చెప్పినా పట్టించుకోకుండా, ఆయన మాటను తేలిగ్గా తీసుకుని వెళ్ళిన భక్తులకు ఏవో ఆటంకాలు కలిగి వెనుదిరిగి రావలసి వచ్చేది. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడేవారు. తన భక్తులు ఇబ్బందుల పాలు కాకూడదనే ఉద్దేశంతోనే కొన్నిసార్లు బాబా వారిని అడ్డగించేవారు. అది గ్రహించక ఏదో ముఖ్యమైన పని ఉందంటూ వెళ్ళి, కష్టనష్టాలుకొనితెచ్చుకునేవారు. అలా ఆపదలు ఎదురైనప్పుడు గానీ, బాబా ఎందుకు వద్దన్నారో గ్రహించేవారు కాదు. బాబా మాటలమీద గురి ఉన్నవారు మాత్రం, ఆయన చెప్పినట్లు విని నిశ్చింతగా ఉండేవారు.

సాయిబాబా షిర్డీ వదిలి ఎక్కడికీ వెళ్ళేవారు కాదు. ఎప్పుడైనా వెళ్తే షిర్డీకి ఉత్తరాన ఉన్న నీంగావ్, దక్షిణాన ఉన్న రహతా గ్రామాలకు మాత్రం వెళ్ళి వచ్చేవారు. ఈ రెండు ఊళ్లకు తప్పించి సాయిబాబా మరెక్కడికీ వెళ్ళింది లేదు. బాబా ఎన్నడూ రైలు ఎక్కలేదు. ఇంకా చెప్పాలంటే రైలును చూడను కూడా లేదు. కానీ, రైళ్ళ రాకపోకల వేళలను, వాటి వివరాలను భక్తులకు వివరించి చెప్పేవారు. ఎవరు ఎక్కడికి వెళ్ళాలో, దారిలో ఎవరు ఎదురౌతారో కూడా చెప్పేవారు. ఆయన ఏది చెబితే అది అక్షరాలా జరిగేది.

సాయిబాబా మసీదులోనే కూర్చుని, ఎక్కడెక్కడ ఏం జరిగిందీ, ఏమి జరగబోతున్నదీ చక్కగా చెప్పేవారు. బాబా ఒక్కోసారి చిత్రవిచిత్రమైన సైగలు చేసేవారు. కొన్నిసార్లు పెద్దపెద్దగా కేకలు వేసేవారు. ఇంకొన్నిసార్లు తనను తానే వీపుమీద చరుచుకునేవారు. మరికొన్నిసార్లు పక్కనున్న భక్తులను విసుక్కునేవారు. ఆ చేష్టలు ఒక్కోసారి ''పిచ్చి పకీరు'' అనిపించేలా ఉండేవి. బాబా ప్రవర్తన కొన్నిసార్లు భయపెట్టేలా కూడా ఉండేది. కానీ, వాటి వెనుక ఏదో గూఢార్ధం ఉండేది. కొద్దిసేపటికి బాబా శాంతించేవారు. భక్తులకు బాబా ఎందుకలా చేస్తున్నారో ఎంతమాత్రం అర్ధమయ్యేది కాదు. దూరాన ఉన్న భక్తులు ఆకస్మిక ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు, వారిని కాపాడే ప్రయత్నంలో బాబా అలా చిత్రంగా ప్రవర్తించేవారు. బాబా ఆ సంగతి చెప్పినప్పుడు పక్కనున్నవారికి ఆశ్చర్యంగానే ఉండేది. నమ్మశక్యం కానట్లు చూసేవారు. కానీ, కొద్దిసేపటికే తమను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వచ్చిన భక్తులను చూశాక, బాబా ఇక్కడే ఉండి, కష్టాల్లో చిక్కుకున్న వారిని ఆదుకున్న తీరు వారిని మరింత ఆశ్చర్యచకితులను చేసేది. మసీదులో ఓ మూల కూర్చుని మహినంతటినీ చూడగల మహిమాన్వితుడు సాయిబాబా.

సాయిబాబాను చేరువగా చూసిన వారిలో కూడా అందరికీ ఆయన బోధనలు అర్ధమయ్యేవి కావు. బాబా మాటల్లోని అంతరార్ధాన్ని గ్రహించేవారు కాదు. కొందరు మాత్రమే బాబాను పరిపూర్ణంగా అర్ధం చేసుకుని తూచ తప్పకుండా అనుసరించేవారు. వారిని బాబా అనుక్షణం కనిపెట్టుకుని ఉండేవారు.
 

మనసే మందిరంగా చేసి సాయిని ఆరాధిద్దాం

          మనసే మందిరంగా చేసి సాయిని ఆరాధిద్దాం                               
సాయిబాబాకు ఆర్భాటాలు, ఆడంబరాలు అక్కర్లేదు. నిండైన మనసు చాలు. మనసునే మందిరంగా చేసి సాయిని ఆరాధిద్దాం. సాయిబాబా పాదాలను ఆశ్రయించడమే ఆరాధన. మనసులో నిరంతరం బాబాను తల్చుకోవడమే నివేదన.

సాయిబాబాకు భక్తుల గురించే ధ్యాస. మనని భావబంధాలనుండి ఎలా విముక్తుల్ని చేయాలి, అశాశ్వతమైన అనుబంధాల నుండి ఎలా బయట పడేయాలి, ఆధ్యాత్మిక చింతన పెంచి జీవితాన్ని సార్ధకం చేయాలి అనే ఆయన చింత. భగవంతుడు మనిషికి అవసరమైనవన్నీ ఇచ్చి భూమ్మీదకు పంపాడు. మరి అలాంటప్పుడు భగవంతుడు తాను ఇచ్చిన ఆస్తులను, మానవులు సవ్యంగా ఖర్చు పెట్టాలని ఆశిస్తాడు కదా. కనుక మనం దేన్నీ దుర్వినియోగం చేయకూడదు. మనకు ఉన్న ఆస్తులను సద్వినియోగం చేసుకుంటూ, తోటివారికి ఉపయోగపడుతూ, జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి.

వివిధ సందర్భాల్లో సాయిబాబా అన్న మాటలు గుర్తుచేసుకుందాం...

ప్రజల్ని సన్మార్గంలో పెట్టమని భగవంతుడు నన్ను పంపాడు. కానీ, ఈ రోజుల్లో ప్రజలు కాస్తయినా దేవుడిపట్ల భక్తిశ్రద్ధలు లేకుండా కాలం గడుపుతున్నారు. క్షణికమైన మొహావేశాల్లో పడి కొట్టుకుపోతున్నారు. సత్సంగాలపై ధ్యాస, నమ్మకం లేవు. సత్యం మాట్లాడుతూ, ధర్మాన్ని ఆచరించమంటే, అసత్యాలు చెప్తూ, అధర్మంలో తేలుతున్నారు. భక్తిభావన నిలుపుకుంటే మీకే శ్రేయస్కరం. నా ప్రయత్నాన్ని నేను చిత్తశుద్ధితో చేస్తాను.

పుడుతున్నాం. తింటున్నాం. కాలయాపన చేస్తున్నాం. పుట్టడం, ఆయుష్షు ఉన్నంతవరకు జీవించడం - ఇదేనా జీవితం? ఇందులో ఏమైనా జీవితపరమార్ధం ఉందా? మన జీవితానికి గమ్యం అంటూ ఉండనవసరం లేదా? సరైన, నిర్దుష్టమైన గమ్యాన్ని నిర్ణయించుకుని దాన్ని చేరేందుకు ప్రయత్నించాలి. మనిషి తనను తాను తెలుసుకోలేనంతవరకూ, గమ్యాన్ని నిర్దేశించుకునేంతవరకు జ్ఞానం లేనట్లే. గమ్యం తెలిసివాడే జ్ఞాని. సద్గురువు బోధనలు వింటే, వాటిని పాటిస్తే జీవితం సార్ధకమౌతుంది.

పుట్టినవారు గిట్టకమానరు. అందరూ మట్టిలో కలిసిపోవలసిందే. అయితే, చావుపుట్టుకల మధ్య ఉన్న జీవితాన్ని సార్ధకం చేసుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది. తోటివారితో వీలైనంత వినయవిధేయతలతో మాట్లాడాలి. జలసాలు, విలాసాలకు దూరంగా నిరాడంబరంగా గడపాలి.

''ఇంద్రియాలను అదుపులో ఉంచుకో
సౌశీల్యాన్ని, సౌజన్యాన్ని అలవర్చుకో
ఎక్కువగా మాట్లాడకు
ఎదుటివారు చెప్పేది విను
సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించు
వంతులు, వాదులాటలు వద్దు
అహంకారాన్ని విడిచిపెట్టు
కోపతాపాలకు దూరంగా ఉండు
దేనిమీదా ఇష్టాన్ని పెంచుకోకు
దేన్నీ ద్వేషించకు
మనోవికారాలకు దూరంగా
నిర్వికారంగా ఉండటం అలవర్చుకో
శ్రద్ధ, సబూరీలను సమర్పించు
ఇదే నిజమైన గురుదక్షిణ''

ఇవన్నీ సాయిబాబా సూక్తులు. అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు ఎంత స్పష్టంగా ఉన్నాయి కదూ! ఆచరించేందుకు ప్రయత్నించండి.

శ్రద్ధ, సబూరీ చాలా అవసరం

                      శ్రద్ధ, సబూరీ చాలా అవసరం...
                             
షిర్డీ సాయిబాబా ఎలాంటి హంగులూ, ఆర్భాటాలూ చూపలేదు. మంత్రాలూ తంత్రాలూ ప్రదర్శించలేదు. నిరాడంబర జీవితం గడిపి చూపారు. సాయిబాబాకు మసీదే మహలు అయింది. అందరూ, అన్ని జీవులూ తినగా మిగిలిన పదార్ధాలనే పంచ భక్ష్య పరమాన్నాలుగా భావించారు. షిర్డీ సాయిబాబా మసీదులో స్తంభాన్ని ఆనుకునో, నింబ వృక్షం కిందనో ఏ ఆడంబరాలూ లేకుండా కూర్చుని, శ్యామా, మహల్సాపతి, బయజాబాయి లాంటి భక్తులకు జీవన సత్యాలు బోధిస్తూ ఉండేవారు. అవి మామూలు మాటలు కాదు, అమూల్యమైన ఆణిముత్యాల మూటలు. ఒక సందర్భంలో సాయిబాబా ఇలా చెప్పారు.

''మీరు ఎవర్నీ నొప్పించకండి. తోటివారు మిమ్మల్ని ఏ రకంగా నయినా కష్టపెట్టినా సరే, వారిని క్షమించండి. మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయండి. ఇలా చేయడం వల్ల మేలు జరగడము, మనశ్శాంతిగా ఉండడమే కాదు, మీకు హాని చేసినవారు, లేదా మిమ్మల్ని నొప్పించిన వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది కూడా. ''శ్రద్ధ, సబూరి చాలా అవసరం. మీరందరూ శ్రద్ధ, సబూరీలను అలవర్చుకోవాలి. సహనం, విశ్వాసం లేనివారు జీవితంలో ఏమీ సాధించలేరు. ఎందుకూ కొరకాకుండా పోతారు. ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి. అన్ని సమయాల్లో సహనంగా వ్యవహరించండి. ఎవరైనా, ఏ కారణంగా నయినా మిమ్మల్ని బాధించినా సహనాన్ని కోల్పోకండి. ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకండి. ఓర్పుతో మెల్లగా నొప్పించని విధంగా సమాధానం చెప్పి, అక్కడినుండి వెళ్లిపోండి.

''ఇతరులు మీపైన అనవసరంగా నిందలు వేసినా మీరు చలించకండి. అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కనుక, నిశ్చలంగా, నిబ్బరంగా ఉండండి. వారితో పోట్లాటకు దిగారంటే, మీరు కూడా వారితో సమానులే అవుతారు. ''దేవునిపట్ల విశ్వాసం ఉంచండి. ఎట్టి పరిస్థితిలో నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. తోటివారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు. వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు. మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. మనను మనం పరీక్షించుకుంటూ, సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి. ఇతరులు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు కలిగిస్తున్నా, పైన భగవంతుడు ఉన్నాడని నమ్మండి. దేవుడు మీకు తప్పక సాయం చేస్తాడనే విశ్వాసాన్ని ఉంచండి. దేవుడివైపు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే, దేవుడు మిమ్మల్ని కాపాడటానికి పది అడుగులు ముందుకు వస్తాడని తెలుసుకోండి..'' సాయిబాబా చిప్పిన మాటలను మర్చిపోకండి. ఆచరించేందుకు ప్రయత్నించండి.

సాయితత్వం

                                      సాయితత్వం

                                     
 శిరిడీలో పాడుబడ్డ మసీదులో చాలా సంవత్సరాలు నివసించి పిచ్చి ఫకీరుగా కనిపించిన మహా యోగి, పరమాత్మ, సచ్చిదానంత స్వరూపుడు శ్రీసాయినాథుడు. సాయి ఫకీరేనా లేక నిజంగా పరమాత్మా అన్న సందేహం చాలామందికి కలుగుతుంది. అంతా మాయ.. సాయి లీలామృతం. దీన్నే శాంబరీ విద్య అంటారు. విష్ణుసూక్తంలోని 5వ శ్లోకంలో ఈ శాంబరీ విద్యగురించి విశదంగా వివరణ ఉంది. "ఇంద్రా విష్ణూ దృంహితాః శంబరస్య..."అంటూ ఇచ్చిన వివరణను అవగతం చేసుకోగలిగితే అతరార్ధం బోధపడుతుంది. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా కనిపించడమే మాయ. ఆ మాయనుంచి తప్పించుకోవడం బ్రహ్మాదులకుకూడా సాధ్యం కానిపని. కానీ.. అతి శునిశితంగా గమనించగలిగే మాత్రం సాధువులను గుర్తుపట్టడం సాధ్యమే.. దానికి తపోనిష్ట, సంకల్పబలంకూడా కావాలి.

భగవద్గీతలో 7వ అధ్యాయంలోని 14వ శ్లోకంలో "దైవీ హ్యేషాగుణమయీ మమ మాయా దురత్వయాం.." అంటూ భగవానుడు తన మాయ త్రిగుణాత్మకమైనదని చెప్పుకొచ్చాడు. అలౌకికమైన ఆ మాయను అధిగమించడం ఆయా అవతారాల్లో స్వయంగా ఆయనకికూడా సాధ్యం కాలేదుమరి. అందువల్లే చాలామంది శిరిడీ సాయినాధుడికి చాలా దగ్గరగా ఉండికూడా ఆయనను గుర్తించలేకపోయారు. మాయామోహాన్ని జయించి సర్వం పరమాత్మ తత్వమే అని గుర్తెరిగినవాళ్లు మాత్రం సాయి లీలల్ని ఆస్వాదించగలిగారు.

గుర్తించలేనివారికి సాయి ఓ ఫకీరు. పిచ్చివాడు. అగ్గిపుల్లలు, నాణేలతో ఆడుకుంటూ, మాసిన బట్టలతో తిరుగుతూ, పాడుబడ్డ మసీదులో ఉంటూ, ఊదీ పాటను పాడుకుంటూ సాయి చేసిన విచిత్రమైన లీలలు.. గుర్తించగలిగినవాళ్లకి మాత్రం ఎన్నో అంతరార్ధాల్ని విడమరిచి చెప్పాయి. తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ, గాల్లో చేతులు ఆడిస్తూ తెలియనిలోకాలవైపుచూస్తూ సాయి చేసే విచిత్రమైన చేష్టల వెనక ఎన్నో లీలలు ఉండేవి.

తనను చూసేందుకు వచ్చిన వాళ్లదగ్గర దక్షిణ అడిగిమరీ పుచ్చుకుని సాయి వాళ్లను పునీతుల్ని చేసేవాడు. రోజూ శిరిడీ వీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేస్తూ తనకు భిక్షవేసినవాళ్ల పాపాల్ని కడిగేసేవాడు. ఓ వ్యక్తి.. సాయీ నిన్ను అందరూ పిచ్చివాడంటున్నారు. ఎందుకలా ప్రవర్తిస్తున్నావు అని నేరుగా అడిగాడు.. అప్పుడు సాయి నాథుడు.. అలా అనుకునే వాళ్లే పిచ్చివాళ్లంటూ ఆయనకు సమాధానం చెప్పాడు.

నిజానికి సాయి దేవుడే అయితే మరి ఎప్పుడూ అల్లా అచ్ఛాకరేగా అనడం ఎందుకు? అన్న సందేహం కూడా చాలా మందికి కలిగింది. అలాంటి సందేహాలు ఎన్నింటికో సాయి ప్రత్యక్షంగా లీలల్ని చూపి సరైన సమాధానం చెప్పకనే చెప్పాడు. ఇప్పటికీ నమ్మిన భక్తులకు నాయకుడై కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటున్నాడు.

పరమేశ్వర స్వరూపం 'సాయిబాబా'

                     పరమేశ్వర స్వరూపం 'సాయిబాబా'
                                      నడి సంద్రంలో నావలాంటి మన జీవితాలకు దారిచూపి దరిచేర్చేది సద్గురువే. అదృష్టం కొద్దీ మనకు బాబా వంటి సద్గురువు లభించారు. బాబాను మనస్పూర్తిగా నమ్మితే, బాబా మన మనోభావాల్లోని తప్పొప్పులు గ్రహించి దిద్దుతారు. మనఃచాంచల్యాలను పటాపంచలు చేస్తారు. మానసికంగా మనలో మార్పు కలిగేలా వేలుపట్టి నడిపిస్తారు.

మేఘశ్యాముడు హరివినాయక సాఠే ఇంట వంట బ్రాహ్మణుడు. అతనికి శివుడు తప్ప మరో దైవం తెలియదు. షిర్డీలో ఉండే బాబా శివుని అవతారమేనని, వెళ్లి దర్శించుకోమని సాఠేచెప్పటంతో మేఘశ్యాముడు షిర్డీకి బయల్దేరాడు. దారిలో ఎవరో బాబా మహమ్మదీయుడని అనగా విన్నాడు. మసీదులో అడుగుపెట్టాడే కానీ, బాబా మహమ్మదీయుడనే భావన అతన్ని వదల్లేదు. బాబా మేఘశ్యామున్ని చూస్తూనే 'వెధవని తన్ని తరిమేయండి' అని కేకలు వేశారు.

"నువ్వు మేలు జాతి బ్రాహ్మణుడివి. నేను తక్కువ జాతి మహమ్మదీయుడిని. పో...పో...నీ కులం, జాతి మైలపడిపోతాయి." బాబా ఆగ్రహంతో మేఘశ్యాముడి మనసు చెదిరింది. త్యంబక్ వెళ్లి కొన్నాళ్లు గడిపాడు. కానీ, మనసు కుదిటపడలేదు. షిర్డీ వచ్చి బాబా పాదాలపై పడ్డాడు. బాబా అతన్ని మన్నించారు.

షిర్డీలోని దేవతలందరినీ పూజించాక చివరిగా బాబాను దర్శించుకుని, పాదసేవ చేయటం మేఘుడికి అలవాటు. ఒకరోజు ఖండోబా మందిరానికి వెళ్లగా తలుపులు  మూసి ఉన్నాయి దీంతో చేసేది లేక మేఘుడు బాబా పూజకు సిద్దమయ్యాడు. "ఖండోబా వాకిలి తెరిచే ఉంది. వెళ్లి నీ పూజ చేసుకుని రా" అని బాబా అతన్ని వెనక్కి పంపారు. భక్తుల మనోభీష్టాలను నేరవేర్చటమే కదా భగవంతుని కర్తవ్యం.

ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబాను గంగాజలంతో అభిషేకించాలనుకున్నాడు. "శిరసును కొద్దిగా తడిపితే చాలు. మొత్తం శరీరం తడపకు" అని షరతు పెట్టి బాబా అతని అభిషేకానికి అనుమతించారు. మేఘుడు ఆ విషయాన్నే మరిచి 'హర గంగే హర గంగే' అంటూ మొత్తం బాబా శరీరంపై నీళ్లు కుమ్మరించాడు. ఆశ్చర్యం! బాబా తల మాత్రమే తడిసింది. శరీరమంతా పొడిగా ఉంది.

ఒకరోజు బాబా మేఘుడికి కలలో కనిపించి అక్షతలు చల్లి, 'త్రిశూలం గీయి' అని చెప్పారు. మేఘుడు కళ్లు తెరిచేసరికి బాబా కనిపించలేదు. కానీ అక్కడ అక్షతలు చల్లి ఉన్నాయి. వెంటనే బాబా వద్దకు వెళ్లి తన కళ గురించి చెప్పాడు.

"అది కళ కాదు. నిజమే. నా నిజ రూపాన్నే నువ్వు చూశావు. వెళ్లి త్రిశూలం గీయి" అని బాబా ఆజ్ఞాపించారు. మర్నాడు పూణా నుంచి వచ్చిన మరో భక్తుడు బాబాకు శివలింగాన్ని కానుకగా ఇచ్చాడు. పక్కనే నిల్చున్న మేఘుడికి బాబా ఆ లింగానిచ్చి "నీ శివుడు వచ్చాడు జాగ్రత్తగా పూజించు" అని చెప్పారు.

మేఘశ్యాముడికి సర్వం బాబానే. శివుడే తన దేవుడని, బాబా మహామ్మదీయుడని రకరకాల భావాల్తో షిర్డీ వచ్చిన అతనిలో మానసికంగా గొప్ప మార్పు కలిగింది. బాబానే సర్వస్యమయ్యారు. చివరకు అతని ఇష్టదైవమైన శివుడిని బాబా అతని చేతుల్లో పెట్టారు.

అందరూ ఒక్కటే. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. రూపాలు వేరైనా భగవత్ స్వరూపం ఒక్కటే. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే భేషజాలు, భేదాలు వద్దని చెప్పటానికే బాబా ఈ లీలను చాటారు. అంత్యకాలంలో మేఘుడు బాబా చెంతనే ప్రాణాలు వదిలాడు. బాబా సాధారణ మనిషిలా అతని కోసం విలపించారు. శ్మశానం వరకు వెళ్లి మేఘుడు మృతదేహానికి బాబా సంస్కారాలు జరిపించారు.

జ్ఞానదీపాలు వెలిగించే సాయిబాబా

                   జ్ఞానదీపాలు వెలిగించే సాయిబాబా
                      
మనం నిత్యం సత్యాన్నే వెంటపెట్టుకుని ఉండాలి. భగవంతునికి ఏదైనా సమర్పించాలనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా, భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో  సహృదయంతో మెలగాలి. బాబాకు సేవ చేస్తున్నామనే ఆలోచన మనసులోకి రానివ్వకూడదు.
                                                                                          
సాయిబాబాకు దీపాలంకరణ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ ద్వారకామాయిలో నూనె దీపాలు వెలిగించి దేదిష్యమానం చేస్తూ ఉండేవారు. అందుకు అవసరమైన నూనెను షిర్డీలోని దుకాణదారులను అడిగి తెచ్చుకునేవారు. కొద్ది రోజులకు వ్యాపారుల్లో దుర్భుద్ధి ప్రవేశించి రోజు బాబాకు ఉచితంగా నూనె ఎందుకు ఇవ్వాలి? అనుకున్నారు. బాబా యథావిధిగా వ్యాపారుల వద్దకు వెళ్లి నూనె అడిగారు. ఎవ్వరూ ఇవ్వలేదు. తమ వద్ద నూనె లేదని చెప్పారు. నూనె లేదు కాబట్టి బాబా ఏం చేస్తారో చూడాలనే కుతూహం వారిలో కలిగింది.

బాబా ప్రతిరోజు నూనె తెచ్చుకునే డబ్బాలో నీళ్లును పోసి బాగా కలియత్రిప్పి ఆనీటిని నోటిలోకి తీసుకుని పుక్కిలించి తిరిగి ఆ డబ్బాలోకి పోశారు. ఆ నీటిని ప్రమిదల్లో పోసి దీపాలు వెలిగించారు. రాత్రంతా అవి జ్ఞానప్రకాశాలను విరజిమ్మాయి. ఇదంతా చూసిన వ్యాపారుల కళ్లకు అజ్ఞానపు చీకట్లు ఆ వెలుగులో తొలగిపోయాయి. క్షమించమంటూ బాబా కాళ్ళపై పడ్డారు. అబద్దాలు ఆడవద్దని, ఎల్లప్పుడూ సత్యాన్నే పలకవలెనని చెప్పి బాబా వారిని పంపించారు.

నిజానికి సూర్యాచంద్రులనే  ఆకాశ దీపాలుగా నిలిపిన మహిమాన్వితుడికి నూనె దీపాలు వెలిగించటం ఓ లెక్కా? బాబా దీపాలు వెలిగించాలంటే నూనె అక్కర్లేదు. సంకల్పం చాలు. కానీ, మానవావతారంలో నడిచిన దైవం బాబా. అందుకే మామూలు మనిషిలా నటించి ఎలా బతుకుతాడో జీవించి చూపారు.

బాబా భక్తుల్ని సన్మార్గంలో పెట్టటానికి, వారి పాపాలు, కర్మల్ని ధ్వంసం చేసి మానవజన్మను చరితార్థం చేయడానికి అవతరించిన దివ్య పురుషుడు. మనం భగవంతునికి భక్తితో పాటు ప్రేమను కూడా అర్పించాలి. నిజానికి మనం అడగదల్చుకున్నవన్నీ గ్రహించి కోరకుండానే అనుగ్రహించి భగవంతుడికి మనం అర్పించుకునేది పరిపూర్ణ భక్తిని మాత్రమే. దానిని శ్రద్ధ, విశ్వాసాలతో పాటించటం ముఖ్యం.

సాయినాథుని దినచర్య

                          సాయినాథుని దినచర్య   

                                  

 


ప్రత్యక్షదైవంగా హిందువుల పూజలందుకుంటున్న షిర్డీ సాయిబాబా జీవనశైలి యోగులందరికి ఆదర్శప్రాయంగా ఉండేది. ఆ జీవనశైలి సామాన్య మానవులకు ఆచరణ సాధ్యం కానిది. ఆయన దినచర్య ఎలా ఉండేదంటే...

బాబా ప్రతిరోజూ తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్రలేచేవారు. బాబా ఒకరోజు ద్వారకామాయిలోనూ, మరొకరోజు చావడిలోనూ నిద్రించేవారు. చావడిలో పడుకున్న మరుసటి రోజు ఉదయం సాయినాథుని భక్తులు మేల్కొలిపి ద్వారకామాయికి తీసుకువచ్చేవారు. ద్వారకామాయిలో కొద్దిసేపు కూర్చుని ధునివైపు చూస్తూ గడిపేవారు. అనంతరం ముఖం కడుక్కునేందుకు లేచేవారు. అప్పటికే గంగాళం నిండా భక్తులు నీళ్ళు సిద్ధం చేసేవారు. ఈ సమయంలో బాబా చాలా కోపంగా కనిపించేవారు. అందువల్ల ఆయన వద్దకు వెళ్ళేందుకు భక్తులు సాహసించేవారు కాదు.

ముఖం కడుక్కున్న తర్వాత కుడిచేతి మణికట్టుకు రోజూ నేతిలో ముంచిన గుడ్డతో కట్టు కట్టుకునేవారు. భక్తులే ఈ కట్టు కట్టేవారు. కట్టు కట్టిన తర్వాత కట్టు కట్టిన వారికి బాబా ఒక రూపాయి ఇస్తుండేవారు. చేతి మీద ఎటువంటి గాయం కనిపించకపోయినా బాబా కట్టుకట్టించుకునే వారు. ఇలా ఎందుకు చేసేవారో తెలియదు.

ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బాబా బిక్షకు వెళ్లేవారు. కేవలం ఐదు ఇళ్లలో మాత్రమే బిక్షాటన చేసేవారు. భిక్షాటన ద్వారా వచ్చిన పదార్థాలతో కొన్ని ధునిలో వేసి, కొంత భాగాన్ని పేదవారికి పంచిపెట్టి, మరికొంత భాగం పశుపక్షాదులకు కేటాయించి, మిగిలిన అతి కొద్ది భాగాన్ని తను తినేవారు బాబా. ఆ తర్వాత లెండీకి బయలుదేరేవారు.

సాయినాథునికి ఎండ తగలకుండా కొందరు భక్తులు ఆయనకు గొడుగు పట్టేవారు. లెండీకి వచ్చిపోయే సమయంలో మాత్రమే బాబా పాదరక్షలు ధరించేవారు. లెండీకి చేరుకోగానే భక్తులు బయటే నిలబడేవారు. బాబా లోనికి వెళ్ళి ఒకటి రెండు గంటలు లెండీలో యోగ సాధన చేస్తూ గడిపేవారు. తిరిగి 11గంటల ప్రాంతంలో ద్వారకామాయి చేరుకునేవారు.

ద్వారకమయికి సాయి చేరుకోగానే మండపంలో గాయకుల గానం మొదలయ్యేది. ఆ సమయంలోనే భక్తులు నైవేద్యాలు తెచ్చిపెట్టేవారు. ఆ నైవేద్యాలను భక్తులకే పంచిపెట్టేవారు బాబా. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హారతి జరిగేది. హారతి సమయంలో బాబాకు భక్తులు వెండి సింహాసనం తెచ్చేవారు. అయితే బాబా మాత్రం ఎప్పుడూ దానిలో కూర్చునేవారు కాదు.

హారతి ముగిసిన తర్వాత గురుస్థానం వద్ద ప్రసాదం పంచిపెట్టేవారు. సమాధి మందిరంలో ఈనాటికీ హారతి ముగియగానే బాబాను దర్శించుకుని వచ్చిన భక్తులకు బయట ప్రసాదాలు పంచుతూ ఉంటారు. ఈ ప్రసాదం ఉదయం నుండీ బాబాకు భక్తులు సమర్పించిన నైవేద్యం నుండి సేకరించినవి.

సమాధి మందిరం వద్ద బాబా విగ్రహం వద్ద రెండు స్టీలు డ్రమ్ములు ఉంటాయి. బాబా దర్శనానికి వెళ్ళే భక్తులు ఆ డ్రమ్ములలోనే బాబాకు తాము నైవేద్యంగా సమర్పించుకోవాలనుకున్న లడ్డూలు, పాలకోవాలు మొదలైన ప్రసాదాలను ఉంచుతారు. వాటినే భక్తులకు తిరిగి పంచిపెడతారు.

సాయినాథుని హారతి అనంతరం ప్రసాదం స్వీకరించిన భక్తులు ఇళ్లకు వెళ్ళిపోయేవారు. సాయంత్రం తిరిగి లెండీ వద్ద కొంతసేపు గడిపి, తిరిగి చావడిలోనో, ద్వారకామాయిలోనే నిద్రకు ఉపక్రమించేవారు బాబా.

సకల యోగ సాధకులు సద్గురు సాయిబాబా

           సకల యోగ సాధకులు సద్గురు సాయిబాబా
                   శ్రీసాయి సకల యోగ సాధకులు. బాబాకు రానివిద్య లేదు. జనం కోసం వాటిని ఏనాడూ చూపించాలనుకోలేదు. బాబా తన ధర్మాన్ని తాను  పాటించటమే కర్తవ్యంగా భావించారు. తన యోగవిద్యలు, మహిమలు, లీలల్ని బహిరంగ ప్రదర్శనల స్థాయికి మార్చేవారు కాదు.ధౌతి, ఖండయోగం, సమాధి స్థితి, షడ్విధ యోగ ప్రక్రియల్లో బాబా ఆరితేరిన వారు ఎవరికంటా పడకుండా బాబా తన యోగ విద్యలు ఆచరించేవారు.

మసీదుకు దూరంగా ఉన్న మర్రిచెట్టు వద్ద ఓ బావి ఉండేది. ప్రతి మూడు రోజులకు ఓసారి బాబా అక్కడకు వెళ్లి ముఖం కడుక్కుని స్నానం చేసేవారు. తర్వాత శరీరంలోని అవయాలను దగ్గరలోని నేరేడు చెట్టుపై ఆరేసేవారు. ఇది భక్తులు కొందరు కళ్లారా చూశారు. ఇలా శరీరంలోని అవయవాలను బయటికి తీసి శుభ్రపర్చుకుని, వాటిని ఆరబెట్టి మళ్లీ యథావిధిగా అమర్చుకోవటాన్ని ధౌతి యోగం అంటారు.

సాధారణంగా మూడు అడుగుల వెడల్పు, ఇరవై రెండున్నర అడుగుల పొడవు గల గుడ్డను కడుపులోకి మింగి అరగంట సేపు లోపల ఉంచి తిరిగి ఆ గుడ్డను బయటికి తీయటాన్ని ధౌతియోగం అంటారు. అంటే ఆ గుడ్డను ఉపయోగించి శరీరం లోపలి అవయవాలను శుభ్రపరచుకోవటం ఈ యోగ ప్రక్రియలోని పరమార్థం. కానీ, బాబా ఆచరించే ధౌతి ప్రక్రియ మిక్కిలి విశిష్టమైనది, అసాధారణమైనది.

బాబా ఆచరించే ఖండయోగం మరీ ఆశ్చర్యకరం. బాబా తన శరీర అవయవాలను వేటికవి వేరుచేసి మసీదు ఆవరణలోఉండడం వలన ఒక పెద్ద మనిషి వాటిని చూసి  మనిషి అవయాలు మసీదు వద్దకు వచ్చాయి. ఎక్కడా బాబా కనిపించలేదు. అవయవాలు మసీదు నాలుగు మూలలా విసిరేసినట్టు కనిపించాయి. వాటిని జాగ్రత్తగా గమనించి బాబా అవయవాలే అని గుర్తించారు. బాబాను ఎవరో చంపేశారని ఆ పెద్ద మనిషి భయపడిపోయాడు. ఈ విషయాన్ని గ్రామ అధికారికి చెప్పాలనుకున్నాడు. అంతలోనే మళ్లీ వెనక్కితగ్గాడు. ఈ విషయాన్ని మొదట చూసింది  తానే కాబట్టి మొదట తననే అనుమానిస్తారన్న భయం వేసింది. దీనితో గ్రామ అధికారికి చెప్పాలనే  ఆలోచనను మానుకుని భయపడుతూనే ఇంటికి వెళ్లాడు. తాను చూసిన విషయాన్ని ఎవరికీ చెప్పాలనుకోలేదు. మర్నాడు బాబా చనిపోయిన  విషయం గ్రామంలో పెద్ద చర్చ అవుతుందని భావించాడు. ఆ రాత్రంతా ఆందోళనతోనే గడిపాడు. తెల్లారింది బాబాకు ఏమైందోననే కంగారు, ఆత్రుతతో గబగబా మసీదుకు పరుగెత్తుకుని వెళ్లాడు. ఆశ్చర్యాల్లోకెల్లా ఆశ్చర్యం! బాబా ధుని ఎదుట కూర్చుని కట్టెలు వేస్తూ కనిపించారు. తాను రాత్రి చూసిన దృశ్యం భ్రమ కాదు కదా అనుకున్నాడు. మనసులోనే బాబాకు నమస్కరించి వెనుతిరిగాడు. బాబా చిన్నవయస్సు నుండే యోగ ప్రక్రియల్లో నిష్ణాతులు. బాబా యోగస్థితి ఎవరికీ అంతుబట్టనిది.

Saturday, September 22, 2012

సుఖప్రదాయకుడు పాదరస ఆంజనేయస్వామి

"ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.." అని ముందుగానే చెప్పినట్లు ఎప్పుడు అధర్మం శ్రుతి మించుతుందో, అప్పుడు విష్ణుమూర్తి అవతరించి, అన్యాయాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తాడు. త్రేతాయుగంలోనూ అదే జరిగింది. విష్ణుమూర్తి, శ్రీరామచంద్రుడిగా అవతరించాడు.  పరమేశ్వరుడు ఆంజనేయునిగా శ్రీరాముడిని అనుసరించాడు.
ఆంజనేయుడు ఆర్తత్రాణ పరాయణుడు. అత్యంత బలవంతుడు. తనను నమ్మిన భక్తులను ఆపదల నుండి బయట పడేస్తాడు. ఆంజనేయుని ఏ రూపంలో అయినా ఆరాధించవచ్చు. ఇతర రూపాల కంటే పాదరస హనుమంతుడి రూపం మరింత పవిత్రమైనది. మంగళవారం లేదా శనివారం హనుమంతునికి ప్రీతికరమైన రోజు కనుక ఆ రెండురోజుల్లో ఏదో ఒక రోజున పాదరస హనుమంతుని పూజిస్తే శుభం కలుగుతుంది. అక్షయ తృతీయ కూడా పాదరస హనుమంతుని పూజకు శ్రేష్టం.
 

పాదరస హనుమంతుడిని ఎలా పూజించాలి ?
పాదరస హనుమంతుడికి పూజ చేయడానికి ముందురోజు రాత్రి తలస్నానం చేయాలి. ఇంట్లో ఒక గదిని ఎంచుకుని, ఆ గది తలుపులు రాత్రిపూట మూయకుండా తెరిచే ఉంచి గది గడపమీద ఎర్రటి వస్త్రాన్ని పరిచి, పాదరస హనుమంతుడి విగ్రహాన్నుంచి భక్తితో ధ్యాన, ఆవాహనాది విధులతో పూజించాలి. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి చదువుతూ, పూలు, అక్షతలు, సింధూరంతో పూజ చేసి ధూప దీప నైవేద్యాలు, తాంబూలం సమర్పించాలి.


                                       

''ఓం నమో హనుమతే రుద్రావతరాయ
పరయంత్ర మంత్ర తంత్ర తాటక నాశకాయ
సర్వ జ్వరచ్చేద కాయ, సర్వ వ్యాధి నికృంతకాయ
సర్వభయ ప్రశమనాయ, సర్వ దృష్టి ముఖ స్తంభనాయ
దేవ దానవ యక్ష రాక్షస భూతప్రేత పిశాచ
ఢాకినీ శాకినీ దుష్టగ్రహ బంధనాయ
సర్వ కార్య సిద్ధిప్రదాయ రామ దూతాయ స్వాహా..''
అనే మంత్రాన్ని జపించాలి. మంత్రజపం ముగిసిన తర్వాత, క్షమామంత్రం చదివి, పూజలో ఉంచిన అక్షతల్ని భక్తిగా తలపై జల్లుకోవాలి. పాదరస పూజ పూర్తయిన తర్వాత భోజనం చేసి బ్రహ్మచర్యం పాటించాలి. గడప మీద ఉంచిన ఆంజనేయ విగ్రహాన్ని ఆ రాత్రి అలాగే ఉంచాలి. దీపం రాత్రంతా వెలుగుతూ ఉండాలన్న నియమం ఏమీ లేదు. ప్రమిదలో నూనె ఉన్నంతవరకూ వెలుగుతూ ఉంటే సరిపోతుంది. మరుసటి రోజున పొద్దున్నే లేచి, స్నానం చేసి ఆంజనేయుడి ముందు దీపారాధన చేయాలి. ముందురోజు రాత్రి చేసినట్లే షోడశోపచారాలతో భక్తిగా పూజ చేయాలి. ఇంతకుముందు స్మరించిన మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఏ దుష్ట శక్తులు మన దరికి చేరకూడదని, ఎలాంటి ఆపదలూ లేకుండా మనమూ, మన కుటుంబమూ సదా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆంజనేయుని భక్తిగా ప్రార్ధించాలి. చివరికి శాంతి మంత్రాన్ని చదువుకోవాలి. పూజలోని అక్షతలు శిరస్సుపై జల్లుకుని, ఆంజనేయునికి ఉద్వాసన చెప్పి, గడపమీదుంచిన ఆంజనేయుని విగ్రహాన్ని తీసుకెళ్లి పూజామందిరంలో ఉంచాలి.
పాదరస ఆంజనేయుని విగ్రహాన్ని పూజా మందిరంలో స్థాపించిన రోజు నుండి, రోజూ చేసే నిత్య పూజ తర్వాత ఇందాక చెప్పుకున్న ''ఓం నమో హనుమతే రుద్రావతరాయ....'' మంత్రాన్ని ప్రతిరోజూ 11 సార్లు జపించాలి. ఇలా చేయగలిగితే ఏ భయాలూ చెంతకు రావు. మనసు నిబ్బరంగా ఉంటుంది. జీవనం సుఖంగా, సంతోషంగా సాగుతుంది

షోడశ గణపతులు

విఘ్నాధిపతి అయిన వినాయకుడిని 16 రూపాల్లో తాంత్రికులు పూజిస్తుంటారు. నిజానికి వినాయకుడికి 32 రూపాలున్నాయనీ, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని చెబుతారు. ఈ 16 రూపాలలో ఒక్కో రూపానిదీ ఒక్కో విశిష్టత. ఆ రూపాలేంటో, వాటి విశిష్టతలేంటో తెలుసుకుందాం.

1. బాల గణపతి :                          


  ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో  అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు. బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి. 

                       కరస్థ కదలీ చూత పన పేక్షుక మోదకమ్
                       బాలసూర్య నిభం వందే దేవం బాలగణాధిపమ్
              అనే మంత్రంతో ప్రతిరోజూ సూర్యోదయ సమయాన చదవాలి.


 2. తరుణ గణపతి :
ఈ వినాయకుడి రూపానికి ఎనిమిది చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, వెలగగుజ్జు, దంతం, చెరకు ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తారు. ఈయనను........

                                         
   పాశాంకశాపూస కపిత్థ జంబూ స్వదంత శాలీనమపి స్వహస్త్రైః ధత్తే సదా య సతరుణాభః పాయాత్స యుష్మాం ష్తరుణో గణేశః  అనే మంత్రంతో పూజించాలి.

3. భక్త గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...



                                      
నాలికేరామ్ర కదలీ గుడపాయాస ధారిణమ్
శరచ్చంద్రాభ్వవుషం భజే భక్త గణాధిపమ్
అనే మంత్రతో స్తుతించాలి...ఈయనను సేవిస్తే భక్తిభావం పెరుగుతుంది.


4. వీరగణపతి
ఈ వినాయకుడి రూపానికి పదహారు చేతులుంటాయి కుడి వైపు చేతులతో బాణం, బేతాలుడు, చక్రం, మంచపుకోడు, గద, పాము, శూలం, గొడ్డలిబొమ్మ ఉన్న జెండా, ఎడమవైపు ఉన్న చేతులతో శక్తి అనే ఆయుధం, విల్లు, ఖడ్గం, ముద్గరమనే ఆయుధం, అంకుశం, పాశం, కుంతమనే ఆయుధం, దంతం ధరించి దర్శనమిస్తారు. ఈయనను....

                                       
                                    
బేతాల శక్తి శర కార్ముక చక్ర ఖడ్గ
ఖట్వాంగ ముద్గర గదాంకుశ నాగపాశాన్
శూలం చ కుంత పరశుధ్వజ మాత్తదంతం
వీరం గణేశ మరుణం త్వనిశం స్మరామి
అనే మంత్రంతో కీర్తించాలి. ఈయనను పూజించిన భక్తులకు తిరుగులేని ధైర్యం ప్రసాదిస్తారు.



5. శక్తి గణపతి                           
                                                                                 

ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం
పరస్పరా శ్లిష్ట కటిప్రదేశమ్
సంధ్యారుణం పాశ స్ఫటీర్దధానం
భయాపహం శక్తి గణేశ మీదే


అనే మంత్రంతో ఈ గణేశుని ప్రార్థించాలి. నాలుగు చేతులున్న ఈ గణపతి అంకుశం, పాశం,విరిగిన దంతం పట్టుకుని దర్శనమిస్తారు. ఈయన కరుణిస్తే ఏదయినా సాధించగలమనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.
6. ద్విజ గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పుస్తకం, దండం ఎడమవైపు ఉన్న చేతులతో అక్షమాల, కమండలం పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

                                            
                                        
యం పుస్తకాక్ష గుణదండ కమండలు శ్రీః
విద్యోతమాన కరభూషణ మిందువర్ణమ్
స్తంబేరమానవ చతుష్టయ శోభమానం
త్వాం ద్విజగణపతే ! సిద్ధ్విజ గణాధిపతే స ధన్యః అనే మంత్రంతో పూజించాలి. ఈ గణపతి తెలివి తేటలు ప్రసాదిస్తాడు. 

7. సిద్ధి (పింగల) గణపతి
ఈ గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో అపజయమన్నది ఉండదు. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పండిన మామిడిపండు, ఎడమవైపు ఉన్న చేతులతో పూలగుత్తి, గొడ్డలి పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....


                                      

పక్వచుత ఫల పుష్పమంజరీ
ఇక్షుదండ తిలమోదకై స్సహ
ఉద్వహన్ పరశుమస్తు తే నమః
శ్రీ సమృద్ధియుత హేమం పింగల
అనే మంత్రంతో స్తుతించాలి.

8. ఉచ్ఛిష్ట గణపతి
కోరిన కోర్కెలు తీర్చే ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులతో నల్ల కలువ, వరివెన్ను ఎడమ వైపు ఉన్న చేతులతో దానిమ్మపండు, జపమాల పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....

                                     

నీలబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్
దధదుచ్ఛిష్ట నామాయం గణేశః పాతు మేచకః
అనే మంత్రంతో ప్రార్థించాలి.


9. విఘ్న గణపతి
గణపతి అసలు లక్షణమైన విఘ్ననాశనం ఈ రూపంలో కనిపిస్తుంది. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడివైపు చేతులతో శంఖం, విల్లు, గొడ్డలి, చక్రం, పూలగుత్తి, ఎడమ వైపు ఉన్న చేతులతో చెరకు, పూలబాణం, పాశం, విరిగిన దంతం, బాణాలు పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...
 

                                                                           

శంఖేక్షు చాప కుసుమేషు కుఠార పాశ
చక్ర స్వదంత సృణి మంజరికా శరౌఘై
పాణిశ్రిఅఅఅ పరిసమీహిత భూషణా శ్రీ
విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌరః అనే మంత్రంతో ప్రార్థించాలి.


10. క్షిప్త గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో దంతం, రత్నాలు పొదిగిన బంగారు కుండ ఎడమ వైపు ఉన్న చేతులతో కల్పవృక్షపు తీగ, అంకుశం ధరించి కనిపిస్తారు. ఈయనను....
                                           

                                            
దంత కల్పలతా పాశ రత్న కుంభాంకుశోజ్జ్వలమ్
బంధూక కమనీయాభం ధ్యాయేత్ క్షిప్ర గణాధిపమ్
అనే మంత్రంతో స్తుతించాలి.





11. హేరంబ గణపతి

                                
                                       
అభయ వరదహస్త పాశదంతాక్షమాల
సృణి పరశు రధానో ముద్గరం మోదకాపీ
ఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రం
గణపతి రతిగౌరః పాతు హేరంబ నామా


అనే మంత్రంతో స్తుతించవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో అభయముద్రనిస్తూ, కత్తి, అక్షమాల, గొడ్డలి, మోదకం ధరించి, ఎడమవైపు ఉన్న చేతులతో వరద హస్త ముద్రతో విరిగిన దంతం, అంకుశం, ముద్గరం, పాశం ధరించి కనిపిస్తారు. ఈయనను సేవిస్తే ప్రయాణాలలో ఆపదలను నివారిస్తారు.

12. లక్ష్మీ గణపతి

                                  
బిభ్రాణ శ్శుకబీజపూరక మిలన్మాణిక్య కుంభాంకుశన్
పాశం కల్పలతాం చ ఖడ్గ విలసజ్జ్యోతి స్సుధా నిర్ఘరః
శ్యామేనాత్తసరోరు హేణ సహితం దేవీద్వయం చాంతికే
గౌరాంగో వరదాన హస్త సహితో లక్ష్మీ గణేశోశావ తాత్ అనే స్తోత్రంతో పూజించవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి  వైపు చేతితో వరదముద్రనిస్తూ, కత్తి, చిలుక, మాణిక్యం పొదిగిన కుంభం, పాశం, ఖడ్గం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అభయ హస్త ముద్రతో దానిమ్మ, అంకుశం, కల్పలత, అమృతం ధరించి కనిపిస్తారు. ఈ సేవిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.


13. మహాగణపతి
ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతులతో మొక్కజొన్న కండె, బాణం తొడిగిన విల్లు, పద్మం, కలువ, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో గద, చక్రం, పాశం, వరికంకి, రత్నాలు పొదిగిన కలశం ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని సేవిస్తే సమస్త శుభాలూ కలుగుతుంది.
                                     
హస్తీంద్రావన చంద్రచూడ మరుణచ్చాయం త్రినేత్రం రసాదాశ్యిష్టం శిరయమాస పద్మకరయా స్వాంకస్థయా సంతతమ్
బీజాపూరగదా ధనుర్విద్య శిఖయుక్ చక్త్రాబ్ద పాశోత్పల
వ్రీహ్యగ్ర స్వవిశాణ రత్న కలశాన్ హస్త్రై ర్వహంతం భజే
అనే మంత్రంతో ప్రార్థించాలి.


14. విజయ గణపతి
సమస్త విజయాలను చేకూర్చే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, పండిన మామిడి పండు ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని....
                                    
పాశాంకుశ స్వదంత్రామ ఫలావా నాఖు వాహనః
విఘ్నం నిఘ్నంతు నమః స్సర్వం రక్తవర్ణో వినాయకః అనే మంత్రంతో పూజించాలి.


15. నృత్య గణపతి
సంతృప్తిని, మనశ్శాంతినీ ఇచ్చే ఈ గణపతి కుడి చేతులలో పాశం, అప్పాలు, ఎడమ వైపు చేతులతో అంకుశం, పదునుగా ఉన్న విరిగిన దంతం ధరించి దర్శనమిస్తారు.
                                         

పాశాంకుశాపూస కుఠారదంతః చంచత్కరః క్లుప్త పరాంగులీకుమ్
పీతప్రభం కల్పతరో రథః స్థం భజామి తం నృత్త పదం గణేశమ్
అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి.


16. ఊర్ధ్వ గణపతి
కారాగార బాధ నుండీ తప్పించే ఈ గణపతి కుడి చేతులలో కలువ, పద్మం, విల్లు, విరిగిన దంతం, ఎడమ వైపు చేతులతో వరివెన్ను, చెరకుముక్క, బాణం, మొక్కజొన్న కండె ధరించి దర్శనమిస్తారు.
                                          
కల్హార శాలి కమలేక్షుక చాపదంతా ప్రరోహ కనకోజ్జ్వల లాలితాంగ ఆలింగ్య గణోద్యతకరో హరితాంగ యష్ట్యా దేవ్యా కరోతు శుభమూర్ధ్వ గణాధిపో మేః అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి.

దీపం లక్ష్మీదేవిరూపం

                      

"దీపం జ్యోతి పరబ్రహ్మమ్ దీపం జ్యోతి పరాయణమ్
దీపేన హారతే పాపమ్ దీప దేవి నమోనమః"



దీపం పరబ్రహ్మ స్వరూపం. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది. ఆ కాంతి వలయం అందరిదీ. దీపం పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదే...అంధకారాన్ని పటాపంచలు చేయడం. అంధకారమంటే కేవలం చీకటిగా ఉండడమే కాదు.... మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే! ఈ అంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే మాత లక్ష్మీదేవి. ఈ అద్భుతశక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి. కాబట్టే దీపానికి మనం నమస్కరిస్తున్నాము. దీపానికి నమస్కరించడమే కాదు. నమస్కరించి ప్రదక్షిణలు చేసి, పండుగలు చేసుకుంటున్నాం. దీపావళి ఇటువంటి  పండుగేకదా!

ఈ దృష్టితో చూస్తే దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టే....ఏ పని ప్రారంభించాలన్నా దీపం వెలిగించి ప్రారంభిస్తాం. దైవారాధననూ దీపం వెలిగించే ప్రారంభిస్తాం. దీపారాధన చేయకుండా అసలు ఏ పుణ్యకార్యం చేయరు. దీపానిది ఎప్పుడూ ఊర్ధ్వదృష్టే. అధో దృష్టి దానికిలేదు. అంటే కిందకి చూడదు. ఎప్పుడూ పైకే చూస్తూ వెలుగుతుంది. మన మనసు ఊర్ధ్వ జగత్తుపైనే లగ్నం కావాలని చెబుతుంటుంది దీపం. ఇక్కడ ఊర్ధ్వ జగత్తు అంటే కేవలం స్వర్గ లోకం మాత్రమే కాదు. జీవితంలో ఎదుగుదల అని. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆశావాదంతో జీవిస్తూ, శక్తివంతమైన దీపాన్ని దైవారాధన చేసే సమయంలో కొన్ని సూత్రాలు పాటిస్తూ దేవుని వద్ద ఉంచాలి. అమ్మవారి పూజలో నూనె దీపాన్ని ఎడంవైపు, ఆవు నెయ్యి దీపాన్ని కుడివైపు వెలిగించాలి. జపం చేసేటప్పుడు జపమాలపై వస్త్రం కప్పి ఉంచాలి. మాల బయటకు కనిపించకూడదు. దీపం శివునికి ఎడంవైపు, విష్ణువుకు కుడివైపు ఉండాలి. ఏ దైవానికైనా దీపం ఎదురుగా మాత్రం ఉంచరాదు.


 

మీనరాశి

పూజించ వలసిన దేవుడు        :     శ్రీ సాయి

అదృష్ట రంగు                           :     పసుపు 

సరిపడని రంగు                       :     పొగ రంగు 

అదృష్ట దిక్కు                          :      ఈశాన్యము 
అదృష్ట రత్నము                      :      కనక పుష్య రాగము 
బరువు క్యారెట్లు                       :      3 క్యారెట్లు 
పనికి రాని వారము                  :       శుక్రవారము 

అదృష్ట వారము                        :       గురువారము 
రత్నము దరించ వలసిన వ్రేలు   :       చూపుడు 
రత్నముధరించవలసినలోహము:       బంగారము 
దర్శించ వలసిన దేవలలయము :       శ్రీసాయి, శ్రీ దత్త దేవాలయము 

గ్రహ తత్వము                            :       ఆకాశ 





Friday, September 21, 2012

కుంభ రాశి

పూజించ వలసిన దేవుడు        :     శివుడు 
అదృష్ట రంగు                           :     నలుపు 
సరిపడని రంగు                       :     తెలుపు 
అదృష్ట దిక్కు                          :     పశ్చిమము  
అదృష్ట రత్నము                      :     నీలము 
బరువు క్యారెట్లు                       :     4 క్యారెట్లు 
పనికి రాని వారము                  :     ఆదివారము 

అదృష్ట వారము                        :    శనివారము
రత్నము దరించ వలసిన వ్రేలు   :    మద్య  
రత్నముధరించవలసినలోహము:    వెండి  
దర్శించ వలసిన దేవలలయము :    శివాలయము 
గ్రహ తత్వము                            :     వాయు 




మకర రాశి

పూజించ వలసిన దేవుడు          :     శివుడు  
అదృష్ట రంగు                             :     నలుపు 
సరిపడని రంగు                         :     తెలుపు 
అదృష్ట దిక్కు                            :      ఈశాన్యం 
అదృష్ట రత్నము                       :     నీలము 
బరువు క్యారెట్లు                        :     4 క్యారెట్లు 
పనికి రాని వారము                   :      ఆదివారము 
అదృష్ట వారము                        :     శనివారము
రత్నము దరించ వలసిన వ్రేలు   :     మద్య   
రత్నముధరించవలసినలోహము:     వెండి 
దర్శించ వలసిన దేవలలయము :    శివాలయము 
గ్రహ తత్వము                            :     వాయు 




ధనుస్సు రాశి

పూజించ వలసిన దేవుడు        :     శ్రీ సాయి, దక్షిణా మూర్తి 
అదృష్ట రంగు                           :     పసుపు 
సరిపడని రంగు                       :     పొగ రంగు 
అదృష్ట దిక్కు                          :     ఈశాన్యం 
అదృష్ట రత్నము                      :     కనక పుష్య రాగం 
బరువు క్యారెట్లు                       :    3క్యారెట్లు 
పనికి రాని వారము                  :     శుక్రవారము 

అదృష్ట వారము                        :     గురువారము
రత్నము దరించ వలసిన వ్రేలు   :     చూపుడు  
రత్నముధరించవలసినలోహము:     బంగారము 
దర్శించ వలసిన దేవలలయము :    శ్రీ సాయి , శ్రీ దత్త దేవాలయము 
గ్రహ తత్వము                            :     ఆకాశ 




వృచ్చిక రాశి

పూజించ వలసిన దేవుడు        :     సుబ్రమణ్య స్వామి 
అదృష్ట రంగు                           :     ఎరుపు 
సరిపడని రంగు                       :     ఆకుపచ్చ 
అదృష్ట దిక్కు                          :     దక్షిణము 
అదృష్ట రత్నము                      :     పగడము 
బరువు క్యారెట్లు                       :    4 క్యారెట్లు 
పనికి రాని వారము                  :    బుధ వారము 

అదృష్ట వారము                        :   మంగళవారము
రత్నము దరించ వలసిన వ్రేలు   :    ఉంగరపు  
రత్నముధరించవలసినలోహము:    వెండి 
దర్శించ వలసిన దేవలలయము :   సుబ్ర మణ్య ఆలయము 
గ్రహ తత్వము                            : అగ్ని 



తుల రాశి

పూజించ వలసిన దేవుడు        :     లక్ష్మీ దేవి 
అదృష్ట రంగు                           :     పొగ రంగు 
సరిపడని రంగు                       :     ఎరుపు 
అదృష్ట దిక్కు                          :     ఆగ్నేయము  
అదృష్ట రత్నము                      :     వజ్రము 
బరువు క్యారెట్లు                       :     10 సెంట్లు 
పనికి రాని వారము                  :     మంగళవారము 

అదృష్ట వారము                        :    శుక్ర వారము 
రత్నము దరించ వలసిన వ్రేలు   :    ఉంగరపు 
దర్శించ వలసిన దేవలలయము :   లక్ష్మీ దేవి ఆలయము 
గ్రహ తత్వము                            : జలము 





కన్యా రాశి

పూజించ వలసిన దేవుడు        :    విష్ణు మూర్తి 
అదృష్ట రంగు                           :     ఆకుపచ్చ
సరిపడని రంగు                       :     ఎరుపు 
అదృష్ట దిక్కు                          :     ఉత్తరము 
అదృష్ట రత్నము                      :     జాతి పచ్చ 

బరువు క్యారెట్లు                       :     5 క్యారెట్లు
పనికి రాని వారము                  :     మంగళవారము 

అదృష్ట వారము                        :    బుధవారము 
రత్నము దరించ వలసిన వ్రేలు   :    చిటికెన 
దర్శించ వలసిన దేవలలయము :   వైష్ణవదేవాలయము     
గ్రహ తత్వము                            : భూ 





సింహ రాశి

పూజించ వలసిన దేవుడు        :     శ్రీ రాముడు 
అదృష్ట రంగు                           :     కాషాయము 
సరిపడని రంగు                       :     నలుపు 

అదృష్ట దిక్కు                          :     తూర్పు 
అదృష్ట రత్నము                      :     కెంపు 

బరువు క్యారెట్లు                       :     3 క్యారెట్లు
పనికి రాని వారము                  :     శని వారము
అదృష్ట వారము                        :    ఆదివారము 
రత్నము దరించ వలసిన వ్రేలు   :    ఉంగరపు 
దర్శించ వలసిన దేవలలయము :   శ్రీ రామ దేవాలయము     
గ్రహ తత్వము                            :  అగ్ని 


కర్కాటక రాశి

పూజించ వలసిన దేవుడు        :      కృష్ణుడు 
అదృష్ట రంగు                           :      తెలుపు 
సరిపడని రంగు                       :     ఆకుపచ్చ 
అదృష్ట దిక్కు                          :     వాయవ్యము 
అదృష్ట రత్నము                      :     ముత్యం 
బరువు క్యారెట్లు                       :     5 క్యారెట్లు 
పనికి రాని వారము                  :    బుధ వారము 
అదృష్ట వారము                        :    సోమవారము 
రత్నము దరించ వలసిన వ్రేలు   :    ఉంగరపు 
దర్శించ వలసిన దేవలలయము :   కృష్ణ దేవాలయము    
గ్రహ తత్వము                            :  జలము 


మిధున రాశి

పూజించా వలసిన దేవుడు     :    విష్ణు మూర్తి 
అదృష్ట రంగు                         :     ఆకుపచ్చ 
సరిపడని రంగు                      :     ఎరుపు 
అదృష్ట దిక్కు                          :      ఉత్తరము 
అదృష్ట రత్నము                      :      జాతి పచ్చ
బరువు క్యారెట్లు                       :      5 క్యారెట్లు 
పనికి రాని వారము                  :     ఆదివారము, మంగళవారము 
అదృష్ట వారము                        :    బుధవారము 
రత్నము దరించ వలసిన వ్రేలు   :     చిటికెన 
దర్శించ వలసిన దేవలలయము  :      విష్ణు దేవాలయము  
గ్రహ తత్వము                            :      భూ 

వృషభ రాశి

పూజించా వలసిన దేవుడు     :     లక్ష్మీ దేవి 
అదృష్ట రంగు                         :     యాష్
సరిపడని రంగు                      :     ఎరుపు 
 అదృష్ట సంఖ్య                        :      6
అదృష్ట దిక్కు                          :      ఆగ్నేయము 
అదృష్ట రత్నము                      :      వజ్రము 
బరువు క్యారెట్లు                       :       10 సెంట్లు 
పనికి రాని వారము                  :      మంగళవారము 
అదృష్ట వారము                        :      శుక్రవారము 
రత్నము దరించ వలసిన వ్రేలు   :      ఉంగరపు 
దర్శించ వలసిన దేవలలయము  :     శ్రీ లక్ష్మీదేవి 
గ్రహ తత్వము                            :      జలము       

మేష రాశి

పూజించ వలసిన దేవుడు         :      సుబ్రమణ్య స్వామీ 
అదృష్ట రంగు                            :      ఎరుపు 
సరిపడని రంగు                        :      ఆకుపచ్చ 
అదృష్ట సంఖ్యలు                       :      8
అదృష్ట రత్నము                        :      పగడము 
బరువు క్యారెట్లు                         :       4
అదృష్ట వారము                          :       మంగళవారము 
పనికిరాని వారము                      :       బుధవారము 
రత్నము ధరించవలసిన వ్రేలు      :       ఉంగరపు 
రత్నము  ధరించవలసిన లోహం   :      వెండి 
దర్శించవలసిన దేవాలయం          :       సుబ్రమణ్య
గ్రహ తత్వము                              :       అగ్ని 



Wednesday, September 19, 2012

తులసి దేవి మంత్రము

తులసి కోటకు నమస్కరించు కునేటప్పుడు ఈ మంత్రం అనుకోవాలి.
 రెండు మంత్రాలో ఏది అయిన జపించవచ్చు.
1. ఓం యమ్మాలే సర్వ తీర్ధాని యున్మధ్యే సర్వ దేవత యదగ్రే సర్వ వేదాశ్చ తులసిత్వా నమామ్యహం నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్ష ప్రదే నమః.
 2. ఓం శ్రీం హ్రీం శ్రీం ఐం బృంధాన్యై స్వాహ.


పూజ అయిన తరువాత మీరు ప్రార్దించవలసిన మంత్రం

ఓం భాగ్య ప్రదో విశ్వాత్మ విఘత్వజ్వరః  సురచార్యర్చితో వస్యో వాసుదేవో వసుప్రదః 

లక్ష్మీ దేవి మంత్రం

ప్రతి రోజు మీరు ఈ మంత్రము జపించినచో అమ్మవారి ఆశిస్సులు మీకు ఎప్పుడు వుంటాయి.

ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద  ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్స్మై నమః 

దుర్గదేవి మంత్రం

ఈ మంత్రం ప్రతి రోజు దుర్గమ్మ దగ్గర ప్రార్దించండి అమ్మవారి అనుగ్రహము  ఎప్పుడు  మీకు వుంటుంది 

నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జఘద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జఘద్వంద్య పాదరవిందే నమస్తే జఘతారిని త్రాహి దుర్గే......

లలితా దేవి మంత్రము

ఈ మంత్రం మీరు రోజు జపించినచో ధన, ధాన్య సిద్ది కలుగుతాయి.
ఓం ఐం  హ్రీం శ్రీం దనాద్యక్ష ధన వివర్దిన్యై నమః 

గణపతి మంత్రము

ఈ మంత్రము ప్రతి రోజు జపించినచో కార్య సిద్ది కలుగుతుంది.
"ఓం శ్రీం హ్రేం క్లీం గణేశ్వరాయ బ్రహ్మస్వరుపాయ గురవే సర్వసిద్ది ప్రదాయ విఘ్నేశ్వ రాయ నమో నమః "