Tuesday, December 4, 2012

కార్తికమాసంలో తులసి దేవిని తాకినా పూజించిన ఏంతో విశేషమైన పలితాన్ని ఇస్తుంది

కార్తికమాసంలో  తులసి దేవిని తాకినా, పూజించిన ఏంతో విశేషమైన పలితాన్ని ఇస్తుంది అవేంటో చుడండి.

ఈ మాసం లో తులసి దేవిని పూజించిన అశ్వమేధ యాగాన్ని చేసిన పలితాన్ని పొందుతారు .
ఒక రోజు ముందు కోసి  మరుసటి రోజు  అంటే నిద్ర చేసిన దళాలను విష్ణు మూర్తి సమర్పించినట్లయితే ఏంతో  విశేషమైన పలితాన్ని ఇస్తుంది.

మీరు జపించవలసిన మంత్రం:
ఓం క్లీం హ్రీం శ్రీం ఐం బృందాయిన్యై స్వాహ.

శనిగ్రహం అనుగ్రహం కలగాలంటే ఇలా చేయండి.

శనివారం రోజు తలకి నూనె పెట్టుకొని చేసినట్లయితే శని అనుగ్రహం కలుగుతుంది. (శని వలన బాదపడుతున్నవారు ఇలా చేయండి చాల మేలు కలుగుతుంది ).
శని అనుగ్రహం కలగాలంటే శనివారం రోజు ఆలుగడ్డలు కానీ లేదా కారెట్ ఇంకా ఎవైన సరే గడ్డ కూరలు ఆహరం ఉండేలా చూసుకోండి.
ఇంకా  ఒక పూట భోజనం చేసి నైట్ పండ్లు తినండి. ఇలా చేస్తే అంట మంచి జరుగుతుంది.

శని వారం రోజు మొక్కలను నాటినచో చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది.

శనివారం రోజు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి స్వామిని దర్శించుకున్న శని అనుగ్రహం కలుగుతుంది.
ఇలా ఫైన చెప్పినవి చేసి చుడండి. మీకే తెలుస్తుంది మార్పు ఏంటో.
శని వలన బాదపడుతున్నవారు ఇంకా ఏలినాటి శని వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు  తప్పక నేను చెప్పిన విదానాలను పాటించండి మ అంతా  మంచి జరుగుతుంది.

మీకు ఏమైనా సందేహాలు వుంటే నాకు ఫీడ్ బ్యాక్ ఇవ్వండి లేదా మెయిల్ పెట్టండి. 

సర్వేజనా సుఖినోభవంతు. 
  


ఆడవాళ్ళు సహజంగ ................

ఆడవాళ్ళు సహజంగ చిన్నవారి నుంచి పెద్దవారి వరకు శుక్రవారం , మంగళవారం  తలస్నానం చేస్తారు కదా .
కాని ...........
వారానికి ఒకసారి తలస్నానం చేసే వారు  శుక్రవారం , మంగళవారం అస్సలు చేయకూడదు. అలా చేసినట్లయితే దరిద్రం అస్సలు మంచిది కాదు.

కాని ......
రోజు తలస్నానం చేసేవారు వారికీ ఏమి పట్టింపు వుండదు. 

కాని వారానికి ఒకసారి తలస్నానం చేసేవారు మాత్రం పిన చెప్పినట్టు పాటించండి.

ఇప్పుడు తలస్నానం ఈరోజు చేస్తే ఎలా వుంటుంది అనేది ప్రయోజనాలను చూద్దామా .

సోమవారం --------------    సౌబాగ్య సిద్ది.

బుధవారం ---------------   సుఖ, సౌఖ్యాలు.

శనివారం ---------------- అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి.



 



Monday, December 3, 2012

పాదరస గణపతి, పాదరస లక్ష్మీ దేవి విశిష్టత ............

 పాదరస గణపతి మీ ఇంట్లో ఉన్నట్లయితే  ప్రతి రోజు జపించుకోవలసిన మంత్రం:
 ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ దీమహి తన్నో దంతిహ్  ప్రచోదయాత్.
 పాదరస లక్ష్మీ దేవి మీ ఇంట్లో ఉన్నట్లయితే ప్రతి రోజు జపించుకోవలసిన మంత్రం
మహలక్స్మైచ  విద్మహే విష్ణు పత్నైచ దీమహి తన్నో లక్శ్మిహ్   ప్రచోదయాత్.
దీనితో పాటు ఇంకో మంత్రాన్ని పటించాలి.
హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మైనమః  
ఇలా చేసినట్లయితే లక్ష్మి గణపతి కృప మీకు ఎప్పుడు ఉంటుది.
ఏ సంకటాలు మీ దరి చేరవు. మీ జీవితం ఏంతో ఆనందమయంగా వుంటుంది.