Tuesday, December 4, 2012

కార్తికమాసంలో తులసి దేవిని తాకినా పూజించిన ఏంతో విశేషమైన పలితాన్ని ఇస్తుంది

కార్తికమాసంలో  తులసి దేవిని తాకినా, పూజించిన ఏంతో విశేషమైన పలితాన్ని ఇస్తుంది అవేంటో చుడండి.

ఈ మాసం లో తులసి దేవిని పూజించిన అశ్వమేధ యాగాన్ని చేసిన పలితాన్ని పొందుతారు .
ఒక రోజు ముందు కోసి  మరుసటి రోజు  అంటే నిద్ర చేసిన దళాలను విష్ణు మూర్తి సమర్పించినట్లయితే ఏంతో  విశేషమైన పలితాన్ని ఇస్తుంది.

మీరు జపించవలసిన మంత్రం:
ఓం క్లీం హ్రీం శ్రీం ఐం బృందాయిన్యై స్వాహ.

శనిగ్రహం అనుగ్రహం కలగాలంటే ఇలా చేయండి.

శనివారం రోజు తలకి నూనె పెట్టుకొని చేసినట్లయితే శని అనుగ్రహం కలుగుతుంది. (శని వలన బాదపడుతున్నవారు ఇలా చేయండి చాల మేలు కలుగుతుంది ).
శని అనుగ్రహం కలగాలంటే శనివారం రోజు ఆలుగడ్డలు కానీ లేదా కారెట్ ఇంకా ఎవైన సరే గడ్డ కూరలు ఆహరం ఉండేలా చూసుకోండి.
ఇంకా  ఒక పూట భోజనం చేసి నైట్ పండ్లు తినండి. ఇలా చేస్తే అంట మంచి జరుగుతుంది.

శని వారం రోజు మొక్కలను నాటినచో చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది.

శనివారం రోజు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి స్వామిని దర్శించుకున్న శని అనుగ్రహం కలుగుతుంది.
ఇలా ఫైన చెప్పినవి చేసి చుడండి. మీకే తెలుస్తుంది మార్పు ఏంటో.
శని వలన బాదపడుతున్నవారు ఇంకా ఏలినాటి శని వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు  తప్పక నేను చెప్పిన విదానాలను పాటించండి మ అంతా  మంచి జరుగుతుంది.

మీకు ఏమైనా సందేహాలు వుంటే నాకు ఫీడ్ బ్యాక్ ఇవ్వండి లేదా మెయిల్ పెట్టండి. 

సర్వేజనా సుఖినోభవంతు. 
  


ఆడవాళ్ళు సహజంగ ................

ఆడవాళ్ళు సహజంగ చిన్నవారి నుంచి పెద్దవారి వరకు శుక్రవారం , మంగళవారం  తలస్నానం చేస్తారు కదా .
కాని ...........
వారానికి ఒకసారి తలస్నానం చేసే వారు  శుక్రవారం , మంగళవారం అస్సలు చేయకూడదు. అలా చేసినట్లయితే దరిద్రం అస్సలు మంచిది కాదు.

కాని ......
రోజు తలస్నానం చేసేవారు వారికీ ఏమి పట్టింపు వుండదు. 

కాని వారానికి ఒకసారి తలస్నానం చేసేవారు మాత్రం పిన చెప్పినట్టు పాటించండి.

ఇప్పుడు తలస్నానం ఈరోజు చేస్తే ఎలా వుంటుంది అనేది ప్రయోజనాలను చూద్దామా .

సోమవారం --------------    సౌబాగ్య సిద్ది.

బుధవారం ---------------   సుఖ, సౌఖ్యాలు.

శనివారం ---------------- అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి.



 



Monday, December 3, 2012

పాదరస గణపతి, పాదరస లక్ష్మీ దేవి విశిష్టత ............

 పాదరస గణపతి మీ ఇంట్లో ఉన్నట్లయితే  ప్రతి రోజు జపించుకోవలసిన మంత్రం:
 ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ దీమహి తన్నో దంతిహ్  ప్రచోదయాత్.
 పాదరస లక్ష్మీ దేవి మీ ఇంట్లో ఉన్నట్లయితే ప్రతి రోజు జపించుకోవలసిన మంత్రం
మహలక్స్మైచ  విద్మహే విష్ణు పత్నైచ దీమహి తన్నో లక్శ్మిహ్   ప్రచోదయాత్.
దీనితో పాటు ఇంకో మంత్రాన్ని పటించాలి.
హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మైనమః  
ఇలా చేసినట్లయితే లక్ష్మి గణపతి కృప మీకు ఎప్పుడు ఉంటుది.
ఏ సంకటాలు మీ దరి చేరవు. మీ జీవితం ఏంతో ఆనందమయంగా వుంటుంది.
 
 

Monday, November 26, 2012

సర్వ శుభములకు మూల మంత్రములు

సంపదకు ఈ క్రింది మంత్రాన్ని పటించినచో అమ్మవారి అనుగ్రహము మీకు ఎల్లప్పుడూ సర్వాభీష్ట  దాయకముగా వుంటుంది.
శ్రీనిదిహి శ్రీవరః శ్రగ్వి శ్రీలక్ష్మీకర పూజితః !
శ్రీరధః శ్రీవిభుహు సింధు కన్యపతి రదోక్షజః !!
---------------------------------------------------------------------
అదృష్టమునకు  ఈ క్రింది మంత్రాన్ని పటించండి (చదవండి).
భాగ్యప్రదో మహాసత్వో విశ్వాత్మ విగతజ్వరః!
సురచార్యర్చితో వస్యో వాసుదేవో వసుప్రదః!!
 ----------------------------------------------------------------------

పాపవిముక్తికై :
ప్రణతార్ది హరిశ్రేష్ఠ  శరణ్యః పాపనాశనః!
పావకో వారనాద్రిశో వైకుంటో వీత కల్మషః !!

--------------------------------------------------------------------------  

 విద్య, తెలివితేటలకు :
ఉద్గీత ప్రణవోద్గీత సర్వ వాగేశ్వరేశ్వర!
సర్వ వేదామయ ,సర్వవేదామయ చింత్య సర్వం భోధయ భోధయ!!

---------------------------------------------------------------------------

వివాహమునకు, దాంపత్యం, కుటుంబ అన్యోన్యతకు:
ఓం హరివల్లభాయై విశ్నుమనోనుకూలాయి!
దివ్యాయై సౌభాగ్యదాయినియై ప్రసీదప్రసీద నమః!!
ఓం నమో పురుషోత్తమాయ విష్ణవే లక్ష్మివల్లభాయ 
సర్వ మంగళాయ శరణ్యాయ పరిష్టాయ ప్రరసీద ప్రసీద నమః

------------------------------------------------------------------------------

సుసంతానమునకై :
విప్రపుత్ర భరతశైవ సర్వమాతృ సూతప్రదః!
పార్ద విశ్వయకృత్ పార్ద ప్రణవర్ద ప్రభోధనః !!
 -------------------------------------------------------------------------------

ఆయురారోగ్యమునకై:
ఓం నమో నారసింహాయ వజ్రధ్రంష్టాయ వజ్రిణే !
వజ్రాయ, వజ్రదేహాయ నమో వజ్ర నఖాయ చ !!
---------------------------------------------------------------------------------

వ్యాపార వృద్ధి కొరకై :
ఓం నమో, మహా సుదర్శనాయ షోడషాయుధ భూషితాయ 
సర్వశత్రువినాశకాయ ప్రత్యాలీదాయ త్రినేత్రాయ 
జ్వాలా స్వరూపాయ సర్వతో భద్రాయ నమః !!
------------------------------------------------------------------------------------

ప్రాణాపాయ రక్షణకై :
ప్రకార రూపాప్రాణేశీ ప్రాణ సంరక్షణి పరా !
ప్రాణ సంజీవని ప్రాచ్యాప్రాణిహి ప్రభోదిని !!
------------------------------------------------------------------------------------

శాంతి, భక్తివైరాగ్యసిద్ధి కొరకు :
ఓం నమో యోగీశ్వరాయ యోగాయ 
శుభదాయ శాంతిదాయ పరమాత్మనే !
జ్ఞానగమ్యాయ త్రుప్తాయ భక్తిప్రియాయ 
హరయే పాహి పాహి నమః !!
ఓం శాంతి ! ఓం శాంతి ! ఓం శాంతి !!
--------------------------------------------------------------------------------------

 

పాదరస దక్షిణావృత శంఖం

 ఈ శంఖాన్ని పూజించటం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయి.
ఈ శంఖం లో తీర్దంను సేవించి నట్లయితే అనారోగ్యాలు దరిచేరవు.
ముఖ్యం గ చెప్పాలంటే దక్షిణావృత శంఖం లక్ష్మీదేవికి చాలా ప్రీతి పాత్రమయినది.
పూజ గది లో  ఈ శంఖం  పెట్టి రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, శివ అష్టోత్తర శత నామావళి  చదివినట్లయితే 
లక్ష్మీదేవి అనుగ్రహం , పరమేశ్వరుని అనుగ్రహం కలిగి అన్ని అన్నరోగాలు కూడా 
ఇంకొక మంత్రం కూడా పటించవచ్చు.

"ఓం శ్రీం  లక్ష్మీమహేశ్వర సమేత  పారద దక్షిణావృత శంఖాయ నమః"


 


Friday, November 23, 2012

కుబేరుని అనుగ్రహించిన మహాశివుడు

తనపైకి రావణుడు దండెత్తిరావడంతో వైశ్రవణుడు నిర్ఘాంతపోయాడు. వైశ్రవణుడు శివభక్తుడు. అయితేనేం యుద్ధానికి తలపడింది మహా బలవంతుడు. అందుకే ధైర్యం సన్నగిల్లి వైశ్రవణుడు గంగాతీరాన ఉన్న కాశీ నగరానికి పారిపోయాడు. తన ఆపదను తల్చుకుని దుఃఖిస్తూ దృఢ సంకల్పంతో తపస్సు చేశాడు.

వైశ్రవణుడి తపో దీక్షకు మహాశివుడు సంతోషించాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు.వైశ్రవణుడు చెప్పింది విని, "లంకా పట్టణం చేజారిపోయిందని నువ్వేం దిగులుపడకు.. నీ తపస్సుకు మెచ్చాను. నీకు లంకా పట్టణాన్ని మించిన అందమైన, అద్భుతమైన, అపూర్వమైన నగరాన్ని ప్రాప్తింప చేస్తాను. నవ నిధులకూ నువ్వు నాయకుడివి అయ్యేలా వరం ఇస్తున్నాను. ఇకపై నీ పేరు వైశ్రవణుడు కాదు, కుబేరుడు. నీకు అనంతమైన సంపదలు ఇస్తున్నాను. నువ్వు అందరికంటే సంపన్నుడివి అవుతావు. నువ్వు నివసించే నగరం సుబిక్షంగా, సుసంపన్నంగా వర్ధిల్లుతుంది. రావణాసురుని మించిన ధనవంతుడివి కాబోతున్నావు. రాబోయే కాలంలో ధనవంతుల ప్రసక్తి వస్తే అందరూ నీ గురించే చెప్పుకుంటారు.." అంటూ వరం ఇచ్చాడు.
ఇప్పటికీ చాలా డబ్బు ఉంది అనే చెప్పదలచుకుంటే కుబేరుడినే తలచుకుంటాం.