Tuesday, December 4, 2012

కార్తికమాసంలో తులసి దేవిని తాకినా పూజించిన ఏంతో విశేషమైన పలితాన్ని ఇస్తుంది

కార్తికమాసంలో  తులసి దేవిని తాకినా, పూజించిన ఏంతో విశేషమైన పలితాన్ని ఇస్తుంది అవేంటో చుడండి.

ఈ మాసం లో తులసి దేవిని పూజించిన అశ్వమేధ యాగాన్ని చేసిన పలితాన్ని పొందుతారు .
ఒక రోజు ముందు కోసి  మరుసటి రోజు  అంటే నిద్ర చేసిన దళాలను విష్ణు మూర్తి సమర్పించినట్లయితే ఏంతో  విశేషమైన పలితాన్ని ఇస్తుంది.

మీరు జపించవలసిన మంత్రం:
ఓం క్లీం హ్రీం శ్రీం ఐం బృందాయిన్యై స్వాహ.

శనిగ్రహం అనుగ్రహం కలగాలంటే ఇలా చేయండి.

శనివారం రోజు తలకి నూనె పెట్టుకొని చేసినట్లయితే శని అనుగ్రహం కలుగుతుంది. (శని వలన బాదపడుతున్నవారు ఇలా చేయండి చాల మేలు కలుగుతుంది ).
శని అనుగ్రహం కలగాలంటే శనివారం రోజు ఆలుగడ్డలు కానీ లేదా కారెట్ ఇంకా ఎవైన సరే గడ్డ కూరలు ఆహరం ఉండేలా చూసుకోండి.
ఇంకా  ఒక పూట భోజనం చేసి నైట్ పండ్లు తినండి. ఇలా చేస్తే అంట మంచి జరుగుతుంది.

శని వారం రోజు మొక్కలను నాటినచో చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది.

శనివారం రోజు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి స్వామిని దర్శించుకున్న శని అనుగ్రహం కలుగుతుంది.
ఇలా ఫైన చెప్పినవి చేసి చుడండి. మీకే తెలుస్తుంది మార్పు ఏంటో.
శని వలన బాదపడుతున్నవారు ఇంకా ఏలినాటి శని వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు  తప్పక నేను చెప్పిన విదానాలను పాటించండి మ అంతా  మంచి జరుగుతుంది.

మీకు ఏమైనా సందేహాలు వుంటే నాకు ఫీడ్ బ్యాక్ ఇవ్వండి లేదా మెయిల్ పెట్టండి. 

సర్వేజనా సుఖినోభవంతు. 
  


ఆడవాళ్ళు సహజంగ ................

ఆడవాళ్ళు సహజంగ చిన్నవారి నుంచి పెద్దవారి వరకు శుక్రవారం , మంగళవారం  తలస్నానం చేస్తారు కదా .
కాని ...........
వారానికి ఒకసారి తలస్నానం చేసే వారు  శుక్రవారం , మంగళవారం అస్సలు చేయకూడదు. అలా చేసినట్లయితే దరిద్రం అస్సలు మంచిది కాదు.

కాని ......
రోజు తలస్నానం చేసేవారు వారికీ ఏమి పట్టింపు వుండదు. 

కాని వారానికి ఒకసారి తలస్నానం చేసేవారు మాత్రం పిన చెప్పినట్టు పాటించండి.

ఇప్పుడు తలస్నానం ఈరోజు చేస్తే ఎలా వుంటుంది అనేది ప్రయోజనాలను చూద్దామా .

సోమవారం --------------    సౌబాగ్య సిద్ది.

బుధవారం ---------------   సుఖ, సౌఖ్యాలు.

శనివారం ---------------- అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి.



 



Monday, December 3, 2012

పాదరస గణపతి, పాదరస లక్ష్మీ దేవి విశిష్టత ............

 పాదరస గణపతి మీ ఇంట్లో ఉన్నట్లయితే  ప్రతి రోజు జపించుకోవలసిన మంత్రం:
 ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ దీమహి తన్నో దంతిహ్  ప్రచోదయాత్.
 పాదరస లక్ష్మీ దేవి మీ ఇంట్లో ఉన్నట్లయితే ప్రతి రోజు జపించుకోవలసిన మంత్రం
మహలక్స్మైచ  విద్మహే విష్ణు పత్నైచ దీమహి తన్నో లక్శ్మిహ్   ప్రచోదయాత్.
దీనితో పాటు ఇంకో మంత్రాన్ని పటించాలి.
హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మైనమః  
ఇలా చేసినట్లయితే లక్ష్మి గణపతి కృప మీకు ఎప్పుడు ఉంటుది.
ఏ సంకటాలు మీ దరి చేరవు. మీ జీవితం ఏంతో ఆనందమయంగా వుంటుంది.
 
 

Monday, November 26, 2012

సర్వ శుభములకు మూల మంత్రములు

సంపదకు ఈ క్రింది మంత్రాన్ని పటించినచో అమ్మవారి అనుగ్రహము మీకు ఎల్లప్పుడూ సర్వాభీష్ట  దాయకముగా వుంటుంది.
శ్రీనిదిహి శ్రీవరః శ్రగ్వి శ్రీలక్ష్మీకర పూజితః !
శ్రీరధః శ్రీవిభుహు సింధు కన్యపతి రదోక్షజః !!
---------------------------------------------------------------------
అదృష్టమునకు  ఈ క్రింది మంత్రాన్ని పటించండి (చదవండి).
భాగ్యప్రదో మహాసత్వో విశ్వాత్మ విగతజ్వరః!
సురచార్యర్చితో వస్యో వాసుదేవో వసుప్రదః!!
 ----------------------------------------------------------------------

పాపవిముక్తికై :
ప్రణతార్ది హరిశ్రేష్ఠ  శరణ్యః పాపనాశనః!
పావకో వారనాద్రిశో వైకుంటో వీత కల్మషః !!

--------------------------------------------------------------------------  

 విద్య, తెలివితేటలకు :
ఉద్గీత ప్రణవోద్గీత సర్వ వాగేశ్వరేశ్వర!
సర్వ వేదామయ ,సర్వవేదామయ చింత్య సర్వం భోధయ భోధయ!!

---------------------------------------------------------------------------

వివాహమునకు, దాంపత్యం, కుటుంబ అన్యోన్యతకు:
ఓం హరివల్లభాయై విశ్నుమనోనుకూలాయి!
దివ్యాయై సౌభాగ్యదాయినియై ప్రసీదప్రసీద నమః!!
ఓం నమో పురుషోత్తమాయ విష్ణవే లక్ష్మివల్లభాయ 
సర్వ మంగళాయ శరణ్యాయ పరిష్టాయ ప్రరసీద ప్రసీద నమః

------------------------------------------------------------------------------

సుసంతానమునకై :
విప్రపుత్ర భరతశైవ సర్వమాతృ సూతప్రదః!
పార్ద విశ్వయకృత్ పార్ద ప్రణవర్ద ప్రభోధనః !!
 -------------------------------------------------------------------------------

ఆయురారోగ్యమునకై:
ఓం నమో నారసింహాయ వజ్రధ్రంష్టాయ వజ్రిణే !
వజ్రాయ, వజ్రదేహాయ నమో వజ్ర నఖాయ చ !!
---------------------------------------------------------------------------------

వ్యాపార వృద్ధి కొరకై :
ఓం నమో, మహా సుదర్శనాయ షోడషాయుధ భూషితాయ 
సర్వశత్రువినాశకాయ ప్రత్యాలీదాయ త్రినేత్రాయ 
జ్వాలా స్వరూపాయ సర్వతో భద్రాయ నమః !!
------------------------------------------------------------------------------------

ప్రాణాపాయ రక్షణకై :
ప్రకార రూపాప్రాణేశీ ప్రాణ సంరక్షణి పరా !
ప్రాణ సంజీవని ప్రాచ్యాప్రాణిహి ప్రభోదిని !!
------------------------------------------------------------------------------------

శాంతి, భక్తివైరాగ్యసిద్ధి కొరకు :
ఓం నమో యోగీశ్వరాయ యోగాయ 
శుభదాయ శాంతిదాయ పరమాత్మనే !
జ్ఞానగమ్యాయ త్రుప్తాయ భక్తిప్రియాయ 
హరయే పాహి పాహి నమః !!
ఓం శాంతి ! ఓం శాంతి ! ఓం శాంతి !!
--------------------------------------------------------------------------------------

 

పాదరస దక్షిణావృత శంఖం

 ఈ శంఖాన్ని పూజించటం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయి.
ఈ శంఖం లో తీర్దంను సేవించి నట్లయితే అనారోగ్యాలు దరిచేరవు.
ముఖ్యం గ చెప్పాలంటే దక్షిణావృత శంఖం లక్ష్మీదేవికి చాలా ప్రీతి పాత్రమయినది.
పూజ గది లో  ఈ శంఖం  పెట్టి రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, శివ అష్టోత్తర శత నామావళి  చదివినట్లయితే 
లక్ష్మీదేవి అనుగ్రహం , పరమేశ్వరుని అనుగ్రహం కలిగి అన్ని అన్నరోగాలు కూడా 
ఇంకొక మంత్రం కూడా పటించవచ్చు.

"ఓం శ్రీం  లక్ష్మీమహేశ్వర సమేత  పారద దక్షిణావృత శంఖాయ నమః"


 


Friday, November 23, 2012

కుబేరుని అనుగ్రహించిన మహాశివుడు

తనపైకి రావణుడు దండెత్తిరావడంతో వైశ్రవణుడు నిర్ఘాంతపోయాడు. వైశ్రవణుడు శివభక్తుడు. అయితేనేం యుద్ధానికి తలపడింది మహా బలవంతుడు. అందుకే ధైర్యం సన్నగిల్లి వైశ్రవణుడు గంగాతీరాన ఉన్న కాశీ నగరానికి పారిపోయాడు. తన ఆపదను తల్చుకుని దుఃఖిస్తూ దృఢ సంకల్పంతో తపస్సు చేశాడు.

వైశ్రవణుడి తపో దీక్షకు మహాశివుడు సంతోషించాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు.వైశ్రవణుడు చెప్పింది విని, "లంకా పట్టణం చేజారిపోయిందని నువ్వేం దిగులుపడకు.. నీ తపస్సుకు మెచ్చాను. నీకు లంకా పట్టణాన్ని మించిన అందమైన, అద్భుతమైన, అపూర్వమైన నగరాన్ని ప్రాప్తింప చేస్తాను. నవ నిధులకూ నువ్వు నాయకుడివి అయ్యేలా వరం ఇస్తున్నాను. ఇకపై నీ పేరు వైశ్రవణుడు కాదు, కుబేరుడు. నీకు అనంతమైన సంపదలు ఇస్తున్నాను. నువ్వు అందరికంటే సంపన్నుడివి అవుతావు. నువ్వు నివసించే నగరం సుబిక్షంగా, సుసంపన్నంగా వర్ధిల్లుతుంది. రావణాసురుని మించిన ధనవంతుడివి కాబోతున్నావు. రాబోయే కాలంలో ధనవంతుల ప్రసక్తి వస్తే అందరూ నీ గురించే చెప్పుకుంటారు.." అంటూ వరం ఇచ్చాడు.
ఇప్పటికీ చాలా డబ్బు ఉంది అనే చెప్పదలచుకుంటే కుబేరుడినే తలచుకుంటాం.

మారేడులోని ఏయే భాగాలు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. --> బిల్వ పత్రాలను నూరి రసం తీసి, శరీరానికి పూసుకుంటే చెమట వాసన రాదు. --> మారేడు వేళ్ళ కషాయం మూలశంక వ్యాధితో బాధపడుతున్నవారికి బాగా పనిచేస్తుంది. --> మారేడు వేళ్ళతోతో చిక్కటి కషాయంచేసి మూలాలను తడిపినట్లయితే, వ్యాధి నయమౌతుంది. --> ఎండిన మారేడుకాయల్ని ముక్కలు చేసి, కషాయం కాచి సేవిస్తే జ్వరం తగ్గుతుంది. --> మారేడు వేరు రసం తీసి, తేనెతో రంగరించి తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయి. ఈ ఔషధాన్ని రోజూ సేవిస్తూ ఉంటే ఎలాంటి అనారోగ్యాలూ కలగవు. --> బిల్వపత్రాలను దంచి కళ్ళపై లేపనంలా రాసుకుంటే కంటి దోషాలు ఏమైనా ఉంటే నశిస్తాయి. --> ఇలా మారేడు ఆకులు, కాయలు, వేళ్ళు చెట్టులోని ప్రతి భాగం శరీరానికి మేలు చేస్తుంది. వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే ఈ చెట్టు దైవంతో సమానం.

--> బిల్వ పత్రాలను నూరి రసం తీసి, శరీరానికి పూసుకుంటే చెమట వాసన రాదు.
--> మారేడు వేళ్ళ కషాయం మూలశంక వ్యాధితో బాధపడుతున్నవారికి బాగా పనిచేస్తుంది.
--> మారేడు వేళ్ళతోతో చిక్కటి కషాయంచేసి మూలాలను తడిపినట్లయితే, వ్యాధి నయమౌతుంది.
--> ఎండిన మారేడుకాయల్ని ముక్కలు చేసి, కషాయం కాచి సేవిస్తే జ్వరం తగ్గుతుంది.
--> మారేడు వేరు రసం తీసి, తేనెతో రంగరించి తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయి. ఈ ఔషధాన్ని రోజూ సేవిస్తూ ఉంటే ఎలాంటి అనారోగ్యాలూ కలగవు.
--> బిల్వపత్రాలను దంచి కళ్ళపై లేపనంలా రాసుకుంటే కంటి దోషాలు ఏమైనా ఉంటే నశిస్తాయి.
--> ఇలా మారేడు ఆకులు, కాయలు, వేళ్ళు చెట్టులోని ప్రతి భాగం శరీరానికి మేలు చేస్తుంది. వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే ఈ చెట్టు దైవంతో సమానం.

మహాశివునికి మారేడు ఎందుకిష్టం ?!

                                                                              


                        
''మా ఱేడు నీవని ఏరేరి తేనా?!
మారేడు దళములు నీ పూజకు...''

అన్నాడు కవీశ్వరుడు వేటూరి. ఎంత అద్భుతమైన శ్లేష?! శ్లేషలో అపురూపమైన భావం దాగి ఉండటమే గొప్పగా చెప్పుకోవాల్సిన సంగతి. మారేడులో ప్రభువుని ఇమిడ్చి చమత్కరించాడు.

మహాశివుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. అందుకే మారేడును ''శివేష్ట'' అని అంటారు. మారేడును బిల్వ అని కూడా అంటారు. బిల్వం అంటే శ్రీఫలము. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలములు ఇచ్చేది, ఇంకా సిరిని తెచ్చే ఫలము కలది అని అర్ధం. మారేడు మహా మంగళకరమైనది. మారేడు పత్రాలు త్రిశిఖలా ఉంటాయి. మూడు ఆకులతో ఉన్నందున త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు.

ఈశ్వరారాధనలో మారేడు దళాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, పూజలో ఎంత ఎక్కువ బిల్వ పత్రాలు వాడితే అంత ఎక్కువ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తాడని, మోక్షం కూడా ప్రాప్తిస్తుందని వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి. కనుకనే శివపూజలో బిల్వ పత్రాలు విస్తృతంగా ఉంటాయి. కొందరు లక్ష బిల్వ పత్రాలతో, మరికొందరు ఏకంగా కోటి బిల్వ పత్రాలతో శివుని ఆరాధిస్తారు. సర్వ శుభాలూ చేకూర్చి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది కనుక బిల్వ వృక్షాన్ని దైవంతో సమానంగా కొలుస్తారు.

పూజలు, పునస్కారాల్లో పూవులతో బాటు కొన్ని ఆకులను ఉపయోగిస్తారు. వాటిల్లో బిల్వ పత్రం ప్రధానమైంది, శ్రేష్ఠమైంది. ఇది కేవలం ఆచారం కాదు. బిల్వ పత్రాలతో పూజించడం వెనుక శాస్త్రీయత దాగి ఉంది. గాలిని, నీటిని శుభ్రపరచడంలో మారేడు ఆకులను మించినవి లేవు. ఈ చెట్టు నుండి వచ్చే గాలి శరీరానికి సోకడం ఎంతో మంచిది. ఈ గాలిని పీల్చడంవల్ల మేలు జరుగుతుంది. జబ్బులు రావు. బాహ్య, అంతర కణాలు అశుద్ధం కాకుండా వుండేట్లు చేసి, దేహాన్ని శ్రేష్ఠంగా ఉంచుతుంది.

దేవాలయం గర్భగుడిలో గాలి సోకదు, సూర్యకిరణాలు ప్రసరించవు కనుక స్వచ్చత కోల్పోయే అవకాశం వుంది. అలాంటి వాతావరణంలో మారేడు ఆకులు స్వచ్చతను కలుగచేస్తాయి. అది మారేడు విశిష్టత. సూర్యుడిలో ఉండే తేజస్సు మారేడులో ఉంటుంది. శరీరం లోపలి భాగాల్లో, బయట వాతావరణంలో ఎక్కడ చెడు ప్రభావం ఉన్నా, దాన్ని హరించి మెరుగుపరచడమే మారేడు లక్షణం.

బిల్వ దళాల్లో తిక్తాను రసం, కషాయ రసం, ఉష్ణ వీర్యం ఉంటాయి. మారేడు అరుచిని పోగొడుతుంది. జఠరాగ్నిని వృద్ది చేస్తుంది. వాత లక్షణాన్ని తగ్గిస్తుంది. మలినాలను పోగొడుతుంది. శ్లేష్మాన్ని, అతిసారాన్ని తగ్గిస్తుంది. గుండె సంబంధమైన వ్యాధులను తగ్గిస్తుంది.

Thursday, November 22, 2012

స్త్రీలు రుద్రాక్ష ధారణ చేయవచ్చా?...





స్త్రీలు రుద్రాక్ష ధారణ చేయవచ్చా ? అనే సందేహం చాలా మందికి ఉంటుంది స్త్రీలు రుద్రాక్షలు ధరించకూడదని ఎక్కడా చెప్పలేదు. స్త్రీలకు ఋతుస్రావం ఆగేవరకూ ధరించడం మంచిది కాదు అంటారు కాని శివునికి ఏ విధమైన అంటు ముట్టు ఉండదు అసలు శివుడే శ్మశానవాసి సృష్టిలలో స్మశానం కంటే మరొక ప్రదేశం ఉండదు. ప్రపంచంలోనే హైందవ దేవాలయాలు ఏదేశంలోనైనా గర్భాలయంలో ప్రవేశం ఉన్నా ? లేకపోయినా శివాలయంలోనికి వెళ్ళవచ్చు ద్వాదశ జ్యోతిర్లింగా నైనా నేరుగా చేతితో తాకవచ్చు.(ఎవ్వరైనా, ఏపరిస్థితిలో ఉన్నా) ఉదాహరణకి శ్రీశైలంలో శివలింగాన్ని ఎవరైనా స్వయంగా తాకవచ్చు అలాగే కాశిలో శివలింగాన్ని సైతం ఎవరైనా స్వయంగా తాకవచ్చు. ఇది అందరికి తెలిసిన సత్యమే శివునికే అంటులేనప్పుడు ఆయన స్వరూపములైన రుద్రాక్షలకు దోషమేముంటుంది. అయితే వీటన్నింటికి మించి మన మనస్సుకు మించినది ఏదీ లేదు. రుద్రాక్షలు ధరించి ఉన్నప్పుడు చెడు పనులకు మనస్సు అంగీకరించదు.

ఉదాహణకు మాంసాహారాన్ని తినేటప్పుడు వాటిని తీసి పక్కనపెట్టి తరువాత ధరిస్తే మంచిది ఎందుకంటే ఇందాక మనం చెప్పుకొన్నట్లు మన మనస్సు ఈ విషయంలో అంగీకరించదు కారణం రుద్రాక్షలంటే పవిత్రమైనవి, శివునకు ఇష్టమైనవి, శక్తి వంతమైనవి అని మన మనస్సుకు తెలుసుకాబట్టి ఆవిధంగా తిరిగి మళ్ళీ ధరించడం మంచిది అప్పుడు ఏవిధమైన దోషములు ఉండవు స్త్రీలు కూడ ఆ మూడు రోజులు పక్కన పెట్టి తదుపరి ధరించడం మంచిది ధరించేముందు కొంచం నీళ్ళు చల్లి సుద్ధిపరిస్తే ఇంకా మంచిది. సన్యసించిన వారు యోగినులు రుద్రాక్షలు ధరించడం మనం చూస్తూ ఉంటాము మన పురాణగ్రంధాలలో పిల్లలకు ఆరు సంవత్సరములు వచ్చే వరకూ అయినా రుద్రాక్షలు ధరింపజేయడం వలన వారి భవిష్యత్తు ఎంతో ఉన్నతంగా ధన, కనక, వాస్తువాహనములతో మంచి కీర్తి కలిగి ఉంటారని చెప్పారు.

చదువుకొనే ఆడపిల్లలు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే వారి విద్యలో బాగా రాణిస్తారు. రుద్రాక్షలు దైవ స్వరూపాలు, క్షుద్రాలు గాదు దైవానికి సంబంధించిన విషయంలో దోషాలు ఉండవు. దేవుని గుడిలోకి వెళ్ళేటప్పుడు పాదరక్షలు బయట విడిచి వెళతాము అలాగే ఏదైనా వెళ్ళకూడని పనికి రుద్రాక్షలు ధరించి (చనిపోయిన చోటికి) వెళ్ళిన లేక ఋతుస్రావం సమయంలో రుద్రాక్ష ధరించి ఉన్నా ఆ తరువాత నీళ్ళతో కడిగి తర్వాత పాలతో శుద్ధిచేసి, మళ్ళీ నీళ్ళతో కడిగి ధారణ చేయాలి మనం తెలియక చేసిన దానికి దోషం లేదు అంటే ఒక ఆసుపత్రికి వెళ్ళామంటే అక్కడ చనిపోయిన వారు ఉండవచ్చు బయటకి వెళితే ఎదురురావచ్చు ఇవి దోషాలు కాదు. మనం తెలిసి వెళ్ళినప్పుడు రుద్రాక్షలు ఇంట విడిచి వెళ్ళాలి యజ్ఞోపవీతాన్ని అపసవ్యం చేసినట్లు.

Wednesday, November 21, 2012

అథ శ్రీ మహాలక్ష్మీ సూక్తమ్



ఓం నమశ్చండి కాయై
అథాంజలిం సమాధాయ హరిఃప్రోవాచ విశ్వకృత్.

విష్ణురువాచ
పరాం పరేశాం జగదాధిభూతాం వరాం వరేణ్యాం వరదాం వరిష్ఠాం !
పరేశ్వరీం బహువాగ్భిః ప్రగీతాం త్వాం సర్వయోనిం సర్వయోనిం శరణం ప్రపద్యే.

శ్రియం సమస్తై రధివాసభూతాం మహాసులక్ష్మీం ధరణీధరాణాం !
అనాది మాదిం పరమార్థరూపాం త్వాం సర్వయోనిం శరణం ప్రపద్యే.

ఏకా మనేకాం వివిధాం సుకార్యాం సకారణాం కరణరూపీణీం చ !
కల్యాణరూపాంచ శివస్వరూపాం త్వాం సర్వయోనిం శరణం ప్రపద్యే.

సర్వాశ్రయాం సర్వజగన్నివాసాం శ్రీమన్మహాలక్ష్మీ మనాది దేవీం !
శక్తిస్వరూపాంచ శివస్వరూపాం త్వాం సర్వయోనిం శరణం ప్రపద్యే.

కామభిధాం శ్రీమధివాసభూతాం హ్రీంరూపిణీం మన్మథబీజయుక్తాం
కళాధ్యబీజాం పరమార్థసంజ్ఞాం రమాం విశాలాం కమాలాధివాసామ్.

వైశ్యానరస్త్రీ సహితేన దేవీం శ్రీమంత్రరాజేన విరాజమానాం !
సర్వార్థధాత్రీం పరమాం పవిత్రాం త్వాం సర్వయోనిం శరణం ప్రపద్యే.

త్రికోణసంచారయుగప్రభావాం షట్కోణమిశ్రాం ద్విదశారసంయుతాం !
అష్టారచక్రాధినివాస భూతాం త్వాం సర్వయోనిం శరణం ప్రపద్యే.

పునర్ధశారద్వితయేన సంయుతాం ద్విపంచకోణాంకిత భూగృహాం చ !
యంత్రాధివాసా మధియంత్రరూపాం త్వాం సర్వయోనిం శరణం ప్రపద్యే.

సంభావితాం సర్వసురై రగమ్యాం సర్వస్వరూపా మతిసర్వసేవ్యాం !
సర్వాక్షరన్యాసవశాం వరిష్ఠాం త్వాం సర్వయోనిం శరణం ప్రపద్యే.

సృష్టిస్థితి ప్రళయాద్వైశ్చ బీజైః న్యాసం విధాయ ప్రజపంతి యే త్వాం !
త ఏవ రాజేంద్రనిగృష్టపాదా విధ్యాధరాణాంచ యశో లభంతే.

ప్రపూజ్య యంత్రం విధినా మహేశీ న్యాసైశ్చ పూతాత్ చరమై స్సుభాగ్యాః !
జపంతి యే త్వాం వివిధార్థధాత్రీం త ఏవ ధన్యాఃకులమార్గనిష్ఠాః.

జానంతి యే పశవస్తే కుపాపా బ్రహ్మాదిగీతం మహిమానం మహేశి !
కేచి న్మహాంతో నిజధర్మలాభాత్ జానంతి తే దేవి పరం సుధామ.

విధాయ కుండం విధినా స్థండిలం వా సౌగంధిహోమం సకలం చ కుర్వతే !
తట్తోషణా జ్ఞాయతే భాగ్యతంత్రం తేషాం సురేశైరపి దూరగమ్యమ్.

పునః స్తువంతి ప్రయతాశ్చ దేవీం స్తోత్రై రుదారైః కులయోగయుక్తాః !
త ఏవ ధన్యాః పరమార్థభాజో భోగశ్చ మోక్షశ్చ కులేస్తితేషామ్.

ఋషిరువాచ
ఇతి స్తుత్యవసానేన మహాలక్ష్మీం దదర్శసః
చతుర్భుజాం త్రిణయనాం మహిషాసురఘాతినీమ్.
అథ శ్రీమన్మహాలక్ష్మీః ప్రసన్నా స్తుతిగౌరవాత్,
ఉవాచ స్మితశోభాఢ్యా, నారాయణ మజం విభుమ్.

శ్రీదేవ్యువాచ
వరం వరయ దేవేశ, నారాయణ సనాతన,
దాస్యా మ్యదాతవ్య మపి, తవ భక్త్యా వశీకృతా.

విష్ణురువాచ
మాతః పరమల్యాణి, మహాలక్ష్మి వరప్రదే
కులాచారే మనో మే స్తు, దృఢం తే కృపయా శివే.
తవ సూక్తం చ సఫలం, భవతు ప్రీతికారకమ్.

శ్రీదేవ్యువాచ
ఏవమస్తు మహాభాగ, నారాయణ సనాతన.
సూక్తమేత ద్వినా యస్తు, పఠే త్సప్తశతీం నరః
స యాస్యతి మహాఘోరం, నరకం దారుణం బిలమ్.
లభ్యతే పరమం శాపం, మమ కోపవిఘూర్ణితః
లక్ష్మీ సూక్తం వినా సప్త శతీ స్తోత్రం న సిద్ధ్యతి.

ఋషి రువాచ
ఏవ ముక్త్వా వచో దేవీ, తూష్ణీ మాసీ న్నృపోత్తమ,
తతోంజలిం సమాధాయ, శివోమితముదాయుతః

తుష్టావవాగ్భిర్ దివ్యాభిః మహాకాళీం మహేశ్వరః
స్తుతిభి ర్వేదవాణీభిర్ లోకానాం హితకామ్యయా.

Tuesday, October 30, 2012

అదృష్ట సంఖ్య 9 అయితే

స్వభావం : ధైర్యంగా వుంటారు. 
ఏ పని నైన ముందడుగు వేసి చేస్తారు.
జయాప జయాలు అసలు పట్టించుకోరు.
ఏ విషయమయిన ముఖం మీద చెప్తారు.
ఎవరి దగ్గర పని చేయరు.
ఆత్మాభి మానమునకు ఏదైనా బంఘం కలిగితే అసలు ఊరుకోరు.
ప్రేమ వ్యవహారం అయితే భంగం వాటిల్లుతుంది.
కీర్తి, ప్రతిష్టలకు భంగం కలుగుతుంది.
దాంపత్య జీవితం గొడవలు కలిగి వుంటారు. కాని కొంత సమయం మాత్రమే తరువాత అంతా చక్కబడుతాయి.
వైద్యం, పోలీస్ శాఖ, రైల్వే , విద్యుత్ , జ్యోతిష్య రంఘం లో మంచిగా రాణిస్తారు.

అనుకూలమయిన  దిక్కు : దక్షిణం.
అనుకూలమయిన వారములు : మంగళ, గురు, శుక్రవారము.
 అనుకూలమయిన రంగు : ఎరుపు.
అనుకూలమయిన అంకెలు : 9,18,27.
ప్రతికూలమయిన అంకెలు : 6,15,24.

పటించ వలసిన మంత్రము :  (ఏ ఒక్క మంత్రమయిన 11 సార్లు జపించాలి). 1. ఓం క్రాం క్రీం క్రౌం సః భౌమాయ నమః 

2. ఓం హ్రుం  శ్రీం మంగళాయ నమః 
3. ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో మంత్రః ప్రచోదయాత్.
 
    
  
  

అదృష్ట సంఖ్య 8 అయితే

స్వభావం : ఉద్రేకంగా మాట్లాడుతారు.
సంఘంలో ప్రజలు అపార్దం చేసుకుంటారు.
ఒంటరి జీవితం గడపాల్సి వస్తుంది.
మానసికంగా ఎదో ఆలోచిస్తూ వుంటారు.
మాటలు భాణాలు గా వుంటాయి. సంఘం లో వ్యక్తులు చేడుగా అనుకుంటారు. కానీ మనసు మంచిగా వుంటుంది.
ఏ పని అయినా చేయగలిగిన సత్తా వుంటుంది.
ప్రేమ వ్యవహారం లో విజయం వుండదు.
30 సంవచ్చరముల తరువాత జీవితం గురించి ఆలోచిస్తారు.
దాంపత్యం బాగుంటుంది.
కృషి చేసే రంగం లో పరిశోధన చేసి  క్రొత్త  విషయాన్ని కనిపెడతారు.
ప్రభుత్వ ఉద్యోగం అనుకూలం.కానీ పని చేసే చోట కొద్దిగా ఇబ్బందులు వుంటాయి.
ఆరోగ్యం జీర్ణాశయం, పళ్లకు, ఉదర సంబంధ వ్యాధులు రావటానికి అవకాశం వుంటుంది. 
 శని గ్రహ ప్రభావ జనితులై  వుంటారు.
ఏ సంవచ్చరంలో నైన డిసెంబర్ 21 నుండి జనవరి 20 వరకు అనుకూలం.
మరియు జనవరి 20 నుండి ఫిబ్రవరి 26 వరకు చాలా అనుకూలంగా వుంటుంది.
అనుకూలమయిన వారములు : శని, ఆది , సోమ 
అనుకూల మయిన దిక్కులు : ఆగ్నేయం, దక్షిణం.
అనుకూలమయిన రంగులు : నేరేడు, నలుపు, బూడిద, ముదురు నీలం .
ప్రతికూలమయిన రంగులు : లేత వర్ణాలు.
పటించ వలసిన మంత్రము :  (ఏ ఒక్క మంత్రమయిన 11 సార్లు జపించాలి). 
1. ఓం ఖ్రాం ఖ్రీం ఖ్రౌం సః శనేయ నమః 
2. ఓం ణం హ్రీం శ్రీం శనై శ్చరాయ  నమః 
3. ఓం కాకద్వజాయ విద్మహే కడ్గ హస్తాయ ధీమహీ తన్నో మంత్రః ప్రచోదయాత్ .

అదృష్ట సంఖ్య 6 అయితే

స్వభావం : తేలిక స్వభావం, ఆనందంగా గడిపే స్వభావం కలిగి వుంటారు. అలాంటి వారితో మాత్రమే స్నేహం చేస్తారు.

శుక్ర గ్రహ ప్రభావ జనితులై  వుంటారు.
ధనం ఎప్పుడు వుంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి వుంటుంది.
 సంఘ జీవితం ఆనందంగా వుంటుంది.
బంగారు ఆభరణాలు బాగా ధరిస్తారు.
సౌందర్య ఉపాసకులు, ఇంటిని బాగా అలంకరించుకుంటారు.
స్త్రీ సంబంధ విలాస వస్తువులు, మధుర పదార్దాలు అమ్మే దుకాణాలు, బట్టల వ్యాపారం పెట్టినచో చాల అనుకూలంగా వుంటుంది.
సంగీతం , కళలలో ఎక్కువ ఆసక్తి కలిగి వుంటారు.
 బంధం అయిన చివరి వరకు వుండాలనుకుంటారు.
ఏ సంవచ్చరంలో నైన ఏప్రిల్ 20 నుండి మే 20 వరకు మరియు సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 22 వరకు చాలా అనుకూలంగా వుంటుంది.
సంఘంలో ఎలాంటి వ్యక్తితో నైన చాల సులభంగా స్నేహం గా వుంటారు.
నమ్మిన స్నేహం కోసం ప్రాణం పెడతారు.
స్నేహం కోసం ఏమయిన చేస్తారు.
 సినిమా, టీవి రంగంలో రాణిస్తారు.
వంశ పారంపర్యం గా గాని, సంపాదించిన దైన ఎప్పుడు ధనం వుంటుంది.
ఏది జరిగిన వెంటనే చెప్పుకోవాలనుకుంటారు.

కలిసి వచ్చే అంకెలు: 6,9,15,18,24,27.
అనుకూలమయిన వారములు :మంగళ వారము, గురువారము, శుక్రవారము.
ధరించ వలసిన  రత్నము : వజ్రము.



పటించ వలసిన మంత్రము :  (ఏ ఒక్క మంత్రమయిన 11 సార్లు జపించాలి).
1. ఓం ద్రాం ద్రీం ద్రౌం సః శుక్రాయ నమః 
2. ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః 

అదృష్ట సంఖ్య 5 అయితే

స్వభావం : తేలిక స్వభావం, ఆనందంగా గడిపే స్వభావం కలిగి వుంటారు. అలాంటి వారితో మాత్రమే స్నేహం చేస్తారు.

బుద గ్రహ ప్రభావ జనితులై  వుంటారు.
ఇతరులు చెప్పిన మాటలను సలహాలను అస్సలు వినరు.
ఉద్రేకం, చాలా విచిత్రం గా ప్రవర్తిస్తూ వుంటారు.
బంధువులతో గడపటానికి అంతగా ఇష్ట పడరు.
ఎలాంటి సమస్య నైన చాల సులభంగా అధిగమిస్తారు.
భాగస్వామితో అంత బాగా  వుండరు. కానీ గొడవలు ఏమి రాకుండా చూసుకుంటారు.
విద్యలో బాగా రాణిస్తారు.
ధనాన్ని కూడబెట్టాలి అన్న స్వభావం తక్కువ.  
షేర్స్ లో బాగా కలిసి  వస్తుంది.
ఏదైన  పని జరగాలి అంటే ఎవరిని నొప్పించక పని సులభం గా జరిపించు కుంటారు.
ఆరోగ్యానికి సంబంధించి నరాల వ్యాధులు వస్తాయి.

కలిసి వచ్చే అంకెలు: 5, 14, 23.
అనుకూలమయిన రంగులు బూడిద రంగు, తెలుపు.
అనుకూలమయిన వారములు : బుధ వారము, శుక్రవారము.
మే 21 నుండి జూన్ 20 వరకు ఏ సంవచ్చరమ్ లో నైన ఏ పని చేసిన కలిసి వస్తుంది.

పటించ వలసిన మంత్రము :  (ఏ ఒక్క మంత్రమయిన 11 సార్లు జపించాలి).
1. ఓం భ్రాం భ్రీం భ్రౌం సః భుదాయ నమః 
2. ఓం ఐం స్త్రీం బుధాయ నమః 
 

అదృష్ట సంఖ్య 4 అయితే

స్వభావం : అనుకూల స్వభావం, సేవిక సంబంద స్వభావం కలిగి వుంటారు.
వీరి వలన ఇతరులు చాలా లాభ పడతారు.
 కానీ ఇతరుల వలన వీరికి అంత బాగా వుండదు.
జాయింట్ వ్యాపారము కలిసిరాదు.
వివాహం త్వరగా జరుగుతుంది.
ధనం బాగా ఖర్చు చేస్తారు.
ముందు , వెనుక ఆలోచించరు.
అవసరానికి తగినట్టుగ ధనం ఎదో ఒక రూపంలో వస్తుంది.
రాహు గ్రహ ప్రభావ జనితులై  వుంటారు.
వీళ్ళ మనస్సు వీరికి శత్రువు.
తమకు సంభవించే అన్ని విషయాల వ్యక్తులు చెడు చేయాలనే ఉద్దేశ్యం కలిగి వుందని అనుకుంటారు.
కలిసి వచ్చే అంకెలు: 4,13,22,31.

అనుకూలమయిన రంగులు : బూడిద రంగు, లేత నీలం.
దరించ వలసిన రాళ్ళు : ఇంద్ర నీలం.

పటించ వలసిన మంత్రము :  (ఏ ఒక్క మంత్రమయిన 11 సార్లు జపించాలి).
1. ఓం భ్రాం భ్రీం భ్రౌం రాహువే నమః 
 2. ఓం ఐం హ్రీం రాహువే నమః 
 3. ఓం నాగద్వజాయ  విద్మహే పద్మ హస్తాయ దీమహీ తన్నో రాహుహు ప్రచోదయాత్.  

అదృష్ట సంఖ్య 3 అయితే

స్వభావం :    సత్ ప్రవర్తన , నీతి నియమాలు, ప్రజ్ఞా వంతులు , బుద్ది మనస్సు చాలా బాగుంటుంది.
 ఆద్యాత్మికత కలిగి వుంటారు.
గణిత శాస్త్రంలో రానిమ్చాతానికి అవకాశం వుంటుంది. 
వారు అనుకున్నదే చేస్తారు.
గురు గ్రహ ప్రభావ జనితులై  వుంటారు.
కలిసి వచ్చే దిక్కు : ఈశాన్యం .
కలిసివచ్చే వారములు :  మంగళ వారం, గురువారం, శుక్ర వారము.
కలిసి వచ్చే అంకెలు: 3,12,21,30.
ఆడవారికి 6,8,9 అదృష్ట సంఖ్యలు  కలిగిన వారితో  వివాహం చేసిన చాలా బాగుంటుంది.
అనుకూలమయిన రంగులు : ఊదా , కెంపు, నీలం, నేరేడు, గులాబీ .


పటించ వలసిన మంత్రము :  (ఏ ఒక్క మంత్రమయిన 11 సార్లు జపించాలి).
1. ఓం గ్రాం గ్రీం గ్రౌం సః గురవే నమః  2. ఓం ఐం క్లీం బృహస్పతయే నమః 
   

అదృష్ట సంఖ్య 2 అయితే

స్వభావం : సున్నిత స్వభావం కలిగి ఉంటారు 
చంద్రగ్రహ ప్రభావ జనితులై  వుంటారు .
వీరు 15 రోజులు ఆనందం 
15 రోజులు విచారంగా వుంటారు
ప్రకృతి సౌందర్య కారకులయి వుంటారు .
సంఘ జీవితం అంత ఆసక్తిగా ఉండదు.
ఉన్నత విద్యలో రాణిస్తారు .
సంగీతంలో రాణిస్తారు .
కవులు , కళాకారులు  కాగలరు .
ప్రేమ వ్యవహారం లో విజయం వుంటుంది.
ఒకరు , ఇద్దరు ప్రాణస్నేహితులు మాత్రమే వుంటారు.
స్త్రీ మూల ధన ప్రాప్తి సిద్దిస్తుంది.
వివాహం తరువాత అయితే భార్య వలన ధనప్రాప్తి వుంటుంది.
మానసికం గ ఎదో ఆలోచలో ఉంటుంటారు.
ఉత్తర దిక్కు బాగా కలిసి వస్తుంది.

ధరించవలసిన రాళ్ళు :జాతిముత్యం, చంద్రకాంతమణి.
అనుకూలమయిన సంఖ్యలు :2,11,20,29.ప్రతికూలమయిన సంఖ్యలు  : 6,8,15,24,26.
 అనుకూలమయిన నెలలు :  జూన్, జూలై.
 అనుకూలమయిన రంగులు : తెలుపు, మీగడ వన్నె, ఆకుపచ్చ.
ప్రతికూల రంగులు : నలుపు , నేరేడు.
అదృష్ట సంఖ్య  5 లేదా 2 అంకె వచ్చిన వారికీ ఇచ్చి వివాహం చేయవలెను.


పటించ వలసిన మంత్రము :  (ఏ ఒక్క మంత్రమయిన 11 సార్లు జపించాలి).
ఓం శ్రాం శ్రీం శ్రౌం సః చంద్రాయనమః
ఓం ఐం క్లీం సోమాయనమః
ఓం భుర్భావ స్వః  యం యంత్ర్యంబకం యజామహే సుగందిం పుష్టి వర్ధనం వుర్వారుక మివ బంధనాన్న జ్యాః యక్షయ  యమామ్నత.