Thursday, September 27, 2012

సకల యోగ సాధకులు సద్గురు సాయిబాబా

           సకల యోగ సాధకులు సద్గురు సాయిబాబా
                   శ్రీసాయి సకల యోగ సాధకులు. బాబాకు రానివిద్య లేదు. జనం కోసం వాటిని ఏనాడూ చూపించాలనుకోలేదు. బాబా తన ధర్మాన్ని తాను  పాటించటమే కర్తవ్యంగా భావించారు. తన యోగవిద్యలు, మహిమలు, లీలల్ని బహిరంగ ప్రదర్శనల స్థాయికి మార్చేవారు కాదు.ధౌతి, ఖండయోగం, సమాధి స్థితి, షడ్విధ యోగ ప్రక్రియల్లో బాబా ఆరితేరిన వారు ఎవరికంటా పడకుండా బాబా తన యోగ విద్యలు ఆచరించేవారు.

మసీదుకు దూరంగా ఉన్న మర్రిచెట్టు వద్ద ఓ బావి ఉండేది. ప్రతి మూడు రోజులకు ఓసారి బాబా అక్కడకు వెళ్లి ముఖం కడుక్కుని స్నానం చేసేవారు. తర్వాత శరీరంలోని అవయాలను దగ్గరలోని నేరేడు చెట్టుపై ఆరేసేవారు. ఇది భక్తులు కొందరు కళ్లారా చూశారు. ఇలా శరీరంలోని అవయవాలను బయటికి తీసి శుభ్రపర్చుకుని, వాటిని ఆరబెట్టి మళ్లీ యథావిధిగా అమర్చుకోవటాన్ని ధౌతి యోగం అంటారు.

సాధారణంగా మూడు అడుగుల వెడల్పు, ఇరవై రెండున్నర అడుగుల పొడవు గల గుడ్డను కడుపులోకి మింగి అరగంట సేపు లోపల ఉంచి తిరిగి ఆ గుడ్డను బయటికి తీయటాన్ని ధౌతియోగం అంటారు. అంటే ఆ గుడ్డను ఉపయోగించి శరీరం లోపలి అవయవాలను శుభ్రపరచుకోవటం ఈ యోగ ప్రక్రియలోని పరమార్థం. కానీ, బాబా ఆచరించే ధౌతి ప్రక్రియ మిక్కిలి విశిష్టమైనది, అసాధారణమైనది.

బాబా ఆచరించే ఖండయోగం మరీ ఆశ్చర్యకరం. బాబా తన శరీర అవయవాలను వేటికవి వేరుచేసి మసీదు ఆవరణలోఉండడం వలన ఒక పెద్ద మనిషి వాటిని చూసి  మనిషి అవయాలు మసీదు వద్దకు వచ్చాయి. ఎక్కడా బాబా కనిపించలేదు. అవయవాలు మసీదు నాలుగు మూలలా విసిరేసినట్టు కనిపించాయి. వాటిని జాగ్రత్తగా గమనించి బాబా అవయవాలే అని గుర్తించారు. బాబాను ఎవరో చంపేశారని ఆ పెద్ద మనిషి భయపడిపోయాడు. ఈ విషయాన్ని గ్రామ అధికారికి చెప్పాలనుకున్నాడు. అంతలోనే మళ్లీ వెనక్కితగ్గాడు. ఈ విషయాన్ని మొదట చూసింది  తానే కాబట్టి మొదట తననే అనుమానిస్తారన్న భయం వేసింది. దీనితో గ్రామ అధికారికి చెప్పాలనే  ఆలోచనను మానుకుని భయపడుతూనే ఇంటికి వెళ్లాడు. తాను చూసిన విషయాన్ని ఎవరికీ చెప్పాలనుకోలేదు. మర్నాడు బాబా చనిపోయిన  విషయం గ్రామంలో పెద్ద చర్చ అవుతుందని భావించాడు. ఆ రాత్రంతా ఆందోళనతోనే గడిపాడు. తెల్లారింది బాబాకు ఏమైందోననే కంగారు, ఆత్రుతతో గబగబా మసీదుకు పరుగెత్తుకుని వెళ్లాడు. ఆశ్చర్యాల్లోకెల్లా ఆశ్చర్యం! బాబా ధుని ఎదుట కూర్చుని కట్టెలు వేస్తూ కనిపించారు. తాను రాత్రి చూసిన దృశ్యం భ్రమ కాదు కదా అనుకున్నాడు. మనసులోనే బాబాకు నమస్కరించి వెనుతిరిగాడు. బాబా చిన్నవయస్సు నుండే యోగ ప్రక్రియల్లో నిష్ణాతులు. బాబా యోగస్థితి ఎవరికీ అంతుబట్టనిది.

No comments:

Post a Comment